ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods - AP PEOPLE SUFFERING WITH FLOODS

Andhra Pradesh People Suffering With Flood Water : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరదలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల కనీస అవసరాలు తీర్చుకోవడానికి సైతం గ్రామస్థులు తిప్పలు పడుతున్నారు.

ap_people_suffering_with_flood_water
ap_people_suffering_with_flood_water (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 11:48 AM IST

People Suffering With Flood Water in Anakapalli District :కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 372 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీప్​కు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో నీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న నీరు 60 రోజులకు సరిపోతుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 53 ఎకరాలకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Heavy Flood Water from Tungabhadra Reservoir Reached Sunkesula Reservoir : కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయం నుంచి దిగువకు వరద నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు సుంకేసుల జలాశయానికి చేరింది. డ్యాంకి వచ్చే నీటి ఇన్​ ఫ్లో 82 వేలు కాగా అవుట్ ఫ్లో 73 వేలుగా అధికారులు తెలిపారు. 20 గేట్లు ఎత్తి కేసీ కాలువకు 15 వందల క్యూసెక్కుల నీటిని వదిలారు.

అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం- విరిగిన కొండచరియలు, స్తంభించిన జన జీవనం - rain updates

Weather Upadates in AP :అల్లూరి సీతారామరాజు జిల్లాను వర్షాలు, వరద వీడటం లేదు. పాడేరు, ముంచింగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో కురిసిన వర్షాల ధాటికి ఆ ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. మారుమూల ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పది రోజులుగా ప్రాథమిక పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులను ప్రమాదకరంగా దాటుతూ ప్రజలు అవసరాలు తీర్చుకుంటున్నారు.

జి. మాడుగుల మండలం రాస వీధి వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో ఓ జీపు దిగబడిపోయింది. ముంచింగిపుట్టు మండలం లక్ష్మీపురం వెళ్లే మార్గంలో కోడాపుట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బైకుకు కర్రలు కట్టి మోసుకెళ్లారు. ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని డుంబ్రిగూడ మండలం సేలంగొంది తీసుకెళ్లేందుకు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటుతూ తీసుకెళ్లడం హృదయ విదారకంగా నిలిచింది. వర్షాలతో ఏజెన్సీ వ్యాప్తంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిత్యావసరాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమీప దుకాణాలు, వారపు సంతలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది.

లంక గ్రామాల్లో గోదావరి వరదలు- ఆస్పత్రికి వెళ్లాలన్నా అష్టకష్టాలే - Patient Suffered Due to Floods

ABOUT THE AUTHOR

...view details