AP Exit Polls Result 2024: లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమికి సర్వే సంస్థలు పట్టం కట్టాయి. ఏపీలో తెలుగుదేశం తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచానాలు వేశాయి. ఏపీలో కూటమి దెబ్బకు వైఎస్సార్సీపీ చతికిలపడుతుందనిన సర్వే సంస్థలు జోష్యం చెప్పాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. ఎన్డీఏకు మూడొందలకుపైగా సీట్లు వస్తాయన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వెల్లడిచేశాయి. ఇండియా కూటమి ఎన్డీఏ దరిదాపుల్లోకి రాదని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి.
ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌పోల్స్...గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాన్నదుంకుటుందంని చెప్పిన కేకే సర్వేస్‌అనే సంస్థ, ఈసారి కూటమిదే ఆధిపత్యమని స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు కేకే సర్వేస్ తెలిపింది. వైఎస్సార్సీపీ ఒక్కటంటే ఒక్కసీటూ గెలుచుకోలేదని, తెలుగుదేశం 17, జనసేన2, భాజపా 6 స్థానాలు కైవసం చేసుకుంటాయని.. వెల్లడించింది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కూడా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సభ విషయానికొస్తే.. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా.. వైఎస్సార్సీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని.. వెల్లడించింది.
తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్నందుకోబోతున్నట్లు. పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 20, వైఎస్సార్సీపీ 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది.
జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించే ఇండియా టీవీ కూడా, రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది. 25 లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 13 నుంచి 15, భాజపా 4 నుంచి6, జనసేన 2 సీట్లు గెలుచకుంటుందని తెలిపింది. ఇక వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని.. అంచనా వేసింది.
సీఎన్ఎక్స్ అనే సంస్థ కూడా, కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15 , భాజపా 4 నుంచి6, జనసేన 2, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని.. తెలిపింది.