ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతవాసులకు 'చెత్త' కష్టాలు - వ్యాధుల భయంతో స్థానికులు - GARBAGE PROBLEM IN ANANTAPUR

చెత్త సేకరణ, నిర్వహణలో యంత్రాంగం వైఫల్యం

GARBAGE_PROBLEM_IN_ANANTAPUR
GARBAGE_PROBLEM_IN_ANANTAPUR (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 12:29 PM IST

Anantapur Residents Facing Garbage Problem :అనంతపురాన్ని చెత్త కమ్మేస్తోంది. చెత్త సేకరణపై పర్యవేక్షణ కొరవడటంతో వీధులు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. మురుగు కాల్వల్లోనూ చెత్త పేరుకుని ప్రవాహం నిలిచిపోయింది. దోమలు, పందుల విజృంభణతో జనాన్ని జబ్బుల భయం వెంటాడుతోంది.

నగరంలో చెత్తకుప్పలు : అనంతపురంలో చెత్తసేకరణ, నిర్వహణ పూర్తిగా పడకేసింది. ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరణలో అధికారులు విఫలమవుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్యక్రమం విఫలమైంది. అదే వైఫల్యం ఇప్పటికీ కొనసాగుతోంది. నగరంలోని 50 మున్సిపల్‌ డివిజన్లలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొనసాగుతుండగా ఆ పాలకవర్గం అన్ని విధాలా విఫలమైంది.

వైఎస్సార్సీపీ హయాంలో 'చెత్త' ప్రాజెక్టుకు తూట్లు - పనులు చేయకుండానే బిల్లులు - People Suffering to Dumping yard

చెత్తను వీధుల్లో పారబోస్తున్న జనం : ఇంటింటికీ వచ్చి చెత్త సేకరించకపోవడం వల్ల ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అనంతపురంలో రోజూ 42 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవుతోంది. నివాసాలు, హోటళ్ల నుంచి ఏ రోజుకారోజు చెత్త సేకరించాల్సి ఉంది. దీని కోసం గత టీడీపీ హయాంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలికల్లో చెత్త సేకరణ పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో ఈ వ్యవస్థను నీరుగార్చారు.

చెత్తను తొలగించాలని డిమాండ్‌ :ఇప్పుడు 15 రోజులకోసారి కూడా చెత్తసేకరణ జరగడం లేదంటూ ప్రజలు ఇళ్లలో పోగైన చెత్తను వీధుల్లో కుప్పగా పోస్తున్నారు. కొన్ని కాలనీల్లో కాలువలు, నాలాల్లో పడేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన చెత్త సేకరణ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి మురుగు కాల్వలను శుభ్రం చేయాలని అనంతపురం ప్రజలు కోరుతున్నారు.

గుంటూరులో చెత్తలో ఫైళ్లు - అధికారులు వచ్చే సరికి మాయం - File In Garbage Tahsildar Office

నగరంలో ఏ రోజు చెత్త ఆ రోజు సేకరించకపోవడం వల్ల ఇంట్లో వారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతం వారికి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అంతే కాకుండా దోమలు, ఈగలు ఇళ్లలోకి విపరీతంగా రావడంతో అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప మాకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించడం లేదు. - స్థానికులు

చెత్త పన్నుతో సామాన్యులు సతమతం - తగ్గించపోతే బుద్ధి చెప్తామని హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details