Anam Venkataramana Reddy:చంద్రబాబు తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చాలని అనుకుంటే, జగన్ మాత్రం గేట్ వే ఆఫ్ జగన్ గా మార్చి దోచుకోవాలనుకుంటున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాభాల్లో ఉన్న కాకినాడ సీపోర్టును జగన్, ఆయన బినామీ కంపెనీ బెదిరించి బలవంతంగా సొంతం చేసుకుందని ఆరోపించారు.
దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని, 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఆయన కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని ఆనం ఆరోపించారు. అందులో భాగంగానే లాభాల్లో ఉన్న కేఎస్‌పీఎల్ సంస్థను బెదిరించి బలవంతంగా జగన్, ఆయన బినామీ కంపెనీ సొంతం చేసుకుందని ఆనం తెలిపారు. కబ్జా చేయాలనుకుంటే మొదట జగన్‌కు గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి మాత్రమే అని, అందుకే ఆయనను రంగంలోకి దింపి దోపిడీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగా 2019 నుంచి కేఎస్‌పీఎల్‌పై దాడి మొదలైందని పేర్కొన్నారు.
తీర ప్రాంతాన్ని ‘గేట్ వే ఆఫ్ జగన్’ గా మార్చారు: టీడీపీ పవర్ కంపెనీకి లైమ్‌స్టోన్‌తో ఏం పని ? ఉత్పత్తి లేకుండానే షేర్ల ధరలు పెంపు: ఆనం వెంకటరమణారెడ్డి
షేర్లు ఇవ్వాలని బెదిరించినా కేఎస్‌పీఎల్ సంస్థ ఒప్పుకోలేదని ఆనం తెలిపారు. ఏటా రూ.300 కోట్లు లాభాల్లో ఉన్న కంపెనీ వాటా ఇవ్వబోమని తెగేసి చెప్పిందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.965.65 కోట్లు ఎగ్గొట్టిందని రిపోర్టు తెచ్చారు. విజయసాయిరెడ్డి వెళ్లి బెదిరిస్తే డబ్బు కడతామని ఆ సంస్థ చెప్పేసిందని, ఇంత బెదిరించినా కేఎస్‌పీఎల్ లొంగలేదని మళ్లీ ఆడిట్‌కు ఆదేశించారని ఆనం తెలిపారు. అరబిందో కంపెనీకి వాటాలు అమ్మాల్సిందేనని కేఎస్‌పీఎల్‌పై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. కేఎస్‌పీఎల్ యజమాన్యాన్ని జైలుకు పంపిస్తామని బెదిరించిన 41శాతం షేర్ రాయించుకున్నారని ఆనం ధ్వజమెత్తారు. షేర్లు బదలాయించాక కట్టాల్సిన రూ. 965 కోట్లు కాస్త రూ.9 కోట్లుగా మారిందని ఆనం తెలిపారు.
ఏటా 300 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న సంస్థను జగన్ బినామీ సంస్థ అరబిందో వాటాలను సొంతం చేసుకుందని తెలిపారు. అరబిందో విజయసాయిరెడ్డి వియ్యంకుల కంపెనీ అని, ఈ సంస్థ జగన్‌కు బినామీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విజయసాయిరెడ్డి కూడా ఆయనకు బినామీనే అని తెలిపారు. కేఎస్‌పీఎల్ షేర్ల హోల్డర్లు, డైరెక్టర్లు, సీఈవోలను జైలుకు పంపిస్తామని బెదిరించి వాటాలు రాయించుకున్నారని తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వైసీపీ అక్రమంగా సంపాదించిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేస్తామని అని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
మీ కంపెనీలు ఎలా అభివృద్ది చెందాయి- అలాగే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచొచ్చుగా జగన్: ఆనం