Amaravati Drone Summit 2024 Logo and Website Launched :అక్టోబర్ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దానికన్నా ముందు విజయవాడలో హ్యాకథాన్‌ను కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డ్రోన్ సమ్మిట్ లోగో, వెబ్‌సైట్‌ను విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్‌కుమార్ ఆవిష్కరించారు. సదస్సుకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. డ్రోన్ కేపిటల్‌గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
డ్రోన్ సాంకేతికత - వినియోగం, ఎదురయ్యే సవాళ్లు : ఈ సందర్భంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, డ్రోన్ సాంకేతికత - వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. డ్రోన్లలో తీసుకురావాల్సిన నూతన టెక్నాలజీ సహా అధ్యయనం పై సమ్మిట్‌లో నిపుణులతో చర్చిస్తామన్నారు. ఏ విభాగాల్లో డ్రోన్లు వాడి మెరుగైన సేవలు పొందవచ్చనే విషయాలపై ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నామని తెలిపారు. వీటి రూపకల్పనపై సమ్మిట్‌లో చర్చిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు సమ్మిట్‌లో పాల్గొంటారని తెలిపారు.
డ్రోన్ల ద్వారా మందుల సరఫరా - పైలట్ ప్రాజెక్టు విజయవంతం - Medicines Delivering with Drones