ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాబుని మళ్లీ రప్పిద్దాం' -జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - Alliance Leaders Election Campaign

Alliance Leaders Election Campaign in AP : రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు. ఒకవైపు ఇంటింటి ప్రచారాలు, మరో వైపు పెద్ద ఎత్తున రోడ్​షోలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ సూపర్​ సిక్స్​ పథకాలను ప్రజల వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు.

election_campaign
election_campaign (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 9:43 AM IST

Alliance Leaders Election Campaign in AP : వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుండటంతో మండుటెండలనూ లెక్కచేయకుండా కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార వైఎస్సార్సీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఆత్మీయ సమావేశాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారాల్లో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

'బాబుని మళ్లీ రప్పిద్దాం' -జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం (ETV Bharat)

Guntur District :గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తాడికొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఫిరంగిపురం మండలంలో విస్తృత ప్రచారం చేశారు. బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ 'బాబుని మళ్లీ రప్పిద్దాం' పేరిట మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. ఇంకొల్లు మండలంలోని పలుగ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించారు. ప్రజలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు.

'జగన్‌ అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధమవ్వాలి' ప్రచారంలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు - Alliance Leaders Campaign

Vijayawada :గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రచారంలో జోరు పెంచారు. గుడివాడ రూరల్‌లో యువతతో కలిసి ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. పామర్రు టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్‌ రాజా సమక్షంలో తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి. పెదపారుపూడి, పమిడిముక్కల మండలాల్లో 500 మంది సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు టీడీపీ గూటికి చేరారు. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ను గెలిపించాలని ఆయన కుమార్తె అవనిజ ఎన్నికల ప్రచారం చేశారు. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ యువకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ప్రచారంలో ఆయనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

50 వేల మెజారిటీతో గెలవడం ఖాయం: టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు - TDp Leader Kalava Srinivas
Palnadu District :పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. మండలంలోని పలుగ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కుమార్‌ అమరావతిలో ఎన్నికల ర్యాలీ చేశారు. అమరావతి జేఎసీ నాయకులు, రాజధాని రైతులు, మహిళలు పాల్గొని ర్యాలీకి మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూటమి అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేపట్టారు. గ్రామగ్రామాన ప్రజలతో మమేకమవుతూ ప్రచారం చేశారు. నల్లిమిల్లికి ఓటు వేసి గెలిపించాలని కొప్పవరంలో జబర్దస్త్‌ నటులు ప్రవీణ్‌, హరికృష్ణ, సబీనాలు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నల్లిమిల్లిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

పిల్లలతో వాలీబాల్‌ ఆడిన నారా బ్రాహ్మణి - BRAHMANI PLAYED VOLLEYBALL

Konaseema District :కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టారు. రావులపాలెంలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా జబర్దస్త్‌ నటుడు గెటప్‌ శీను ప్రచారం చేశారు. పవన్‌కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రచారం చేశారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి కొడవలూరు మండలంలో ప్రచారం చేశారు. ప్రజలకు టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించారు.

Prakasam District : ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌రావు భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు బాణసంచా పేలుస్తూ, పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ చేపట్టిన భరోసా యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యాత్రలో ఆయన ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆదోనిలో ఎంఆర్​పీఎస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థి పార్థసారథికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోలో మాదిగలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ - Hero Shivaji Election Campaign

Anantapur District :అనంతపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ లోక్‌సభ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతపురంలో ఎంఆర్​పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాదిగలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగలకు పిలుపునిచ్చారు. రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుకు ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. హీరేహాల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. బాణసంచా పేల్చి, డప్పులు వాయించి ఘనస్వాగతం పలికారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. కందుర్పి మండలంలోని పలుగ్రామాల్లో ఆయన రోడ్‌షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders Election Campaign

Annamayya District :అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రోడ్‌ షో నిర్వహించారు. నందలూరు మండలంలోని పలుగ్రామాల్లో ఆయన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలుగ్రామాల్లో బాణసంచా పేల్చి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోకు ప్రజల పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చైతన్యరెడ్డి సమక్షంలో తెలుగుదేశంలోకి పెద్దఎత్తున వలసలు కొనసాగాయి. సుమారు 200 కుటుంబాలు వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరాయి. కడప లోక్‌సభ అభ్యర్థి భూపేశ్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరులో పుత్తా నర్సింహారెడ్డి సమక్షంలో మరో 200 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి టీడీపీ గూటికి చేరాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తరఫున సినీ నటుడు పృథ్వీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి శ్రీనివాసులును గెలిపించాలని అభ్యర్థించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో టీడీపీ ప్రచారంలో వైఎస్సార్సీపీ శ్రేణుకు కవ్వింపు చర్యలకు దిగాయి. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎదరుతిరగడంతో పలయానం చిత్తగించారు.

ABOUT THE AUTHOR

...view details