Alliance Govt Solving Problems in Vijayawada:గత ఐదేళ్లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చాక క్రమంగా కుదుటపడుతున్నారు. రహదారులు, తాగునీరు, మురుగు కాల్వల సమస్యల నుంచి ఉపసమం పొందుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఏళ్లతరబడి నెలకొని ఉన్న సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తోంది. రోడ్లకు గుంతలు పూడ్చే పని వేగవంతంగా సాగుతోంది. దీంతో పాటు తాగునీటి సమస్యకు పరిష్కారం చేపే దిశగా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు.
రోడ్లు గుంతలు పూడ్చడంతో పాటు అవసరమైన చోట్ల నూతన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. కోట్లాది రూపాయలతో నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బాటలు పడుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమౌతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్లపై గుంతలు పూడ్చే పనులు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో పాటు నగరంలో ఏ చోట తాగునీటి, భూగర్భ డ్రైనేజీ సమస్య తలెత్తిన త్వరతగతిన పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.
మొగిలిఘాట్‌కు మోక్షం - ప్రమాదాల నివారణకు చర్యలు
రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. వీఎంసీ విడుదల చేసే నీరు రంగుమారి రావడం, తక్కువ సమయం రావడం, సరిపడా నీరు రాకపోవడం వంటి సమస్యలు తరచూ ఉత్పన్నం అవుతుంటాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం సుమారు 74 కోట్ల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఈ ప్లాంటు రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వాటర్ పైపు లైన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఆ ప్లాంట్ పూర్తి అయితే చుట్టుపక్కల చుట్టుపక్కల డివిజన్ల ప్రజలు సుమారు రెండున్నర లక్షల మందికి తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. అవసరమైన చోట్ల తాగునీటి సరఫరా చేసే పైపులైన్లలో కొత్త పైపులు వేసేందుకు చర్యలు చేపట్టారు. నగర ప్రజలను ప్రధానంగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి సంతోషం వ్యక్తమౌతుంది. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీల సమస్యల పరిష్కారం చేయడానికి కూటమి ప్రభుత్వం చొరవ చూపడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే ప్రస్తుతం ప్రారంభించిన పనులు త్వరగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే - బీజేపీపై దుష్ప్రచారం తగదు : పురందేశ్వరి
కృష్ణా జలాల వివాదం - తెలంగాణ వాదనను వ్యతిరేకించిన ఏపీ