Arrests in Women Gang Rape Case:శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో హిందూపురానికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా పోలీసులు గుర్తించారు. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
కత్తులతో ఇద్దరు మహిళలనీ బెదిరించి మరీ ఇలా:ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి మరీ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు మహిళలపై, వారి భర్తలపై దాడికి తెగబడిన అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి మొత్తానికి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
CM Chandrababu Phone to SP About Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్మెన్, అతని కుమారుడిని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ సీఎంకు వివరించారు. ఉపాధి కోసం వాచ్మెన్ కుటుంబం బళ్లారి నుంచి వచ్చిందని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.
ఉపాధి కోసం వచ్చిన వారిపై అత్యాచారం దారుణం:అత్యాచార ఘటనపై మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖకు చెందిన వారిని సమన్వయం చేసి మరీ నేరస్థలను పట్టుకోవడంలో కీలక పాత్రను పోషించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖ మంత్రి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన వారిపై అత్యాచారం చేయడం క్షమించరాని నేరమని ఆమె మండిపడ్డారు.