ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టపగలు తీసుకెళ్లి చీకటి పడేదాకా కొట్టారు - యువకుడిపై నలుగురి దాడి - THREE YOUTHS ATTACK ON YOUNG MAN

ఓ యువకుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి చితక బాదిన ముగ్గురు యువకులు - సోషల్ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలు

Three Youths Attack On Young Man
Three Youths Attack On Young Man (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 1:27 PM IST

Three Youths Attack On Young Man : ఓ యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అతి దారుణంగా కొట్టారు. తలపై పిడిగుద్దులు గుద్దుతూ, కాలితో తన్నుతూ, దుర్భాషలాడుతూ, కిందపడేసి, చొక్కా చించేసి ఇష్టారీతిగా కొట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

విచక్షణారహితంగా దాడి :పోలీసుల తెలిపిన వివరాలివీ.. మలికిపురం మండలం గూడపల్లికి చెందిన జయసాయి యువరాజ్ అనే యువకుడిని ముగ్గురు యువకులు సత్యజ్యోతి థియేటర్ సమీపంలోకి తీసుకెళ్లారు. వెంటనే ఆ యువకుడిని దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా చితక బాదారు. కర్రలతో, పిడి గుద్దులతో, చేతికి దొరికిని వాటితో అతడిపై దాడి చేశారు. ఆ యువకుడు కొట్టొద్దని వేడుకున్నా కనికరం చూపలేదు. నలుగురు యువకుల్లో ముగ్గురు అతి కిరాతకంగా జయసాయిని కొడుతుండగా మరో యువకుడు సెల్​ఫోన్​లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నన్నే పక్కకు తప్పుకోమంటావా! - ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్‌పై మందుబాబు దాడి

పోలీసులకు ఫిర్యాదు : ఈ దారుణ ఘటన ఈ నెల 5న జరిగినట్టు తెలుస్తోంది. ఓ యువతి కారణంగా ముగ్గురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. తమ కుమారుడిని చిత్రహింసలకు గురిచేస్తూ ముగ్గురు యువకులు కొట్టిన ఘటనపై జయసాయి యువరాజ్ తండ్రి మలికిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా మొహరించిన పోలీసులు - ఇంటర్నెట్ బంద్ - 55 మంది గ్రామస్థుల అరెస్ట్​​

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన సభ- ఎవరిని అడిగి పెట్టారంటూ రెచ్చిన వైసీపీ నేత

ABOUT THE AUTHOR

...view details