How to do Navagraha Pradakshina : చాలా మందికి గుడికి వెళ్లగానే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలా? లేదా దేవుడిని దర్శించుకోవాలా ? నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ? ప్రదక్షిణల తర్వాత కాళ్లు కడుక్కోవచ్చా? ఇలా అనేక సందేహాలు మదిలో మెదులుతుంటాయి. అయితే, ఈ ప్రశ్నలకు ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం.
లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని తెలిపే సంకేతాలివే - కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందంటే!
నవగ్రహాల విషయంలో కొన్ని పొరపాట్లు :
సహజంగానే కొందరు ఆలయానికివెళ్లినప్పుడు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పులు విడిచి పెట్టడానికి స్టాండ్ వంటివి లేకపోతే ధ్వజస్తంభం, రావి చెట్టు, చిన్నచిన్న విగ్రహాల దగ్గర చెప్పులు విడిచి పెడుతుంటారు. అలా ఎప్పుడూ చెప్పులు విడిచిపెట్టకూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేకపోతే, కాళ్లు కడుక్కునే చోట చెప్పులు విడిచి ఆలయం లోపలికి వెళ్లాలి.
చాలా మందికి ఆలయంలోకి ప్రవేశించగానే దేవుడిని దర్శించుకోవాలా? లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా? అని సందేహం కలుగుతుంది. అయితే, ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్లగానే పరివారంలో ఉన్న దేవతలను దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రధాన దేవుడిని దర్శించుకోవాలి. అంటే ఆలయానికి వెళ్లగానే నవగ్రహాలను దర్శనం చేసుకోండి. ఆపై ప్రదక్షిణలు చేయాలి. అనంతరం పరమేశ్వరుడిని దర్శించుకోవాలి. అంతేగానీ, ముందుగా ప్రధాన దేవుడిని దర్శించి, ఎట్టి పరిస్థితుల్లోనూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకూడదు.
నవగ్రహాల ప్రదక్షిణ ఇలా చేయాలి :
ముందుగా కాళ్లు కడుక్కున్న తర్వాత తూర్పువైపు తిరిగి సూర్యుడికి నమస్కరించాలి. అనంతరం మీ వీలును బట్టి నవగ్రహాలకు 3, 9, 11, 21, 54 లేదా 108 ప్రదక్షిణలు చేయవచ్చు. నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే నవగ్రహాల అనుగ్రహం విశేషంగా కలుగుతుంది.
నియమం లేదు!