YSRCP MLCs Resign : వైఎస్సార్సీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఎమ్మెల్సీ పదవులతో పాటు వైఎస్సార్సీపీకి కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వైఎస్సార్సీపీ నుంచి మరో రెండు వికెట్లు ఔట్ - పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా! - YSRCP MLCs Resign - YSRCP MLCS RESIGN
YSRCP MLCs Resign : వైఎస్సార్సీపీకీ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఈ లిస్టులో మరికొంత మంది చేరనున్నట్లు తెలుస్తోంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2024, 1:41 PM IST
|Updated : Aug 30, 2024, 1:47 PM IST
మరో ఆరుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు, పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు బీజేపీ వైపు వెళ్లవచ్చని అంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.