Visakha Steel Plant in Power Trouble : విశాఖ ఉక్కుకు విద్యుత్ షాక్ తగిలింది. స్టీల్ ప్లాంట్లోని సొంత కేప్టివ్ పవర్ ప్లాంట్ నడపడానికి తగినంత బొగ్గు సరఫరా కానందువల్ల పరిస్థితి దినదిన గండంగానే వుంది. విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కులోనే 315 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదిలోనే ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన ధర్మల్ బొగ్గును ఒడిశాలోని కోల్ ఇండియా సబ్సిడరీ మహానది కోల్ ఫీల్డ్స్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ప్రతిపక్షంలో ప్రగల్భాలు - అందలమెక్కాక నోరు మెదపని వైసీపీ ఎంపీలు
ఒప్పందాన్ని అనుసరించి ఏటా సుమారు 17 లక్షల టన్నుల థర్మల్ బొగ్గును విశాఖ ఉక్కు పరిశ్రమకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటించేంత వరకూ ఈ సరఫరా నిరంతరాయంగానే జరిగింది. తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బొగ్గు సరఫరాను దాదాపు పూర్తిగా తగ్గించేసింది. వంద మెగావాట్లను మించి విద్యుత్ సరఫరా జరగడం లేదు. మిగిలిన విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తోంది. మొదట్లో నెలకు 20 కోట్ల రూపాయలు ఉండే విద్యుత్ బిల్లు ఇప్పుడు ఏకంగా 90 కోట్ల వరకూ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా విద్యుత్ బిల్లులను చెల్లించలేని దుస్థితిలో విశాఖ ఉక్కుపడిపోయింది. గోడచుట్టుపై రోకలిపోటులా అన్నట్టు పరిస్థితి మారిపోయింది.
విశాఖ ఉక్కు భూములు విక్రయించారా? కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?: హైకోర్టు