పల్నాడు తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు - వైసీపీ పనేనన్న టీడీపీ Fires Breaks Out At Party Office:పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించారు.
సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా: పల్నాడు జిల్లా క్రోసూరులోని తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నాలుగురోడ్ల కూడలిలోని మన్నెం భూషయ్య కాంప్లెక్స్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కూటమి నేతలు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండేందుకు తాటాకులతో పందిరి ఏర్పాటు చేశారు. నిన్నరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ పందిరికి నిప్పటించారు. క్షణాల్లో పందిరి దగ్ధమైంది. పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల గృహాల వారు భీతిల్లారు.
ఓర్వలేక నిప్పు పెట్టారు: అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రజా గళం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. క్రోసూరులో ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, ఓర్వలేక నిప్పు పెట్టారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. ఇది వైసీపీ నాయకుల పనేనని టీడీపీ శ్రేణులు ఆందోళనకు చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. సమీపంలోనే అగ్నిమాపక కేంద్రం ఉన్నా, మంటలార్పడానికి ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు. అగ్నిమాపక యంత్రాన్ని వైసీపీ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతూ, సమీపంలోని వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఘటనపై విచారణ చేపడతామని, ప్రమాదానికి కారకులైన వారని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో టీడీపీ శ్రేణులు శాంతించారు.
అంగన్వాడీల దీక్షా శిబిరానికి నిప్పు - వైసీపీ నాయకులపై అనుమానం
'వైసీపీ శ్రేణులు మా కార్యాలయానికి నిప్పు అంటించారు. మెున్న జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, తట్టుకోలేక మా కార్యాలయాన్ని తగలబెట్టారు. ఓటమి భయంతోనే మా పార్టీ కార్యలయం తగలబెట్టారు. మేం తలుచుకుంటే వాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. విజయం కోసం వైసీపీ నేతలు తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటే సహించబోం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలి. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.' - భాష్యం ప్రవీణ్, కూటమి అభ్యర్థి
నరసరావుపేటలో స్థల వివాదం - వైఎస్సార్సీపీ నేతల మధ్య ఘర్షణ