ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'INDIA కూటమి వైపు జగన్​ చూపు'- 'అంత సాహసం చేస్తాడనుకోవడం లేదు' - jagan join INDIA - JAGAN JOIN INDIA

jagan join INDIA : జగన్​ చూపంతా కాంగ్రెస్​ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చేరికపై ఉందని ఎన్డీఏ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ కూడా పార్టీల చేరికపై ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. దిల్లీలో జగన్​ ధర్నాకు ఇండియా కూటమి నేతలు హాజరై మద్దతు పలకడం అందుకు నిదర్శమని తెలిపారు.

jagan_join_india_alliance
jagan_join_india_alliance (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 12:24 PM IST

jagan join INDIA : ఇండియా కూటమిలో చేరేందుకు జగన్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఎన్డీఏ నేతలు అన్నారు. జగన్​కు దిల్లీ స్థాయిలో ఓ పునరావాసం కావాలని, అదే సమయంలో ఇండియా కూటమికి కూడా పార్టీల అవసరం ఉందని వారు ఉదహరించారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అసెంబ్లీ లాబీల్లో యనమల, విష్ణుకుమార్ రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి విడివిడిగా మీడియాతో చిట్ చాట్​లో మాట్లాడారు.

జగన్‌ దిల్లీ పారిపోయి, ధర్నా చేసి అభాసు పాలయ్యారు: మాజీ మంత్రి దేవినేని ఉమా - TDP Devineni Uma Fires On YS Jagan

ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్​ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగనుకు దిల్లీ స్థాయిలో ఓ పునరావాసం కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలని పేర్కొన్నారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కావడమే అందుకు సంకేతం అని వెల్లడించారు. ఇండియా కూటమిలో చేరడం జగన్​కు అనివార్యం అని, ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారని వెల్లడించారు.

బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్​కు ఉందా? అని ప్రశ్నించారు. అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ మరో నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి లో చేరే ధైర్యమూ జగన్ కు లేదని ఎద్దేవా చేశారు. దిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని, చేరిక ప్రయత్నాలు బెడిసికొట్టాయని తెలిపారు. పెద్దిరెడ్డి భూదందా బయటకు రాకూడదనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక మాజీమంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టించారు, మరో మంత్రి కాకాణి ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని ధ్వజమెత్తారు. నిందితులెవ్వరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, ప్రతిపక్షంలో ఉండే దమ్ము, ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్​ పార్టీకి లేదన్నారు.

జగన్​ పాలనలో అకారణంగా హింసించి జైల్లో పెట్టారు: బాధితుడు - Allegations on YSRCP

జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్ - Nara Lokesh on YS Jagan

ABOUT THE AUTHOR

...view details