ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

"ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి- విజయసాయిరెడ్డికి డీఎన్​ఏ టెస్టుకు రావాలి" - Vijayasai Reddy affair - VIJAYASAI REDDY AFFAIR

Vijayasai Reddy affair : వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్ మొదటి భర్త మదన్​మోహన్​ దిల్లీలో ధర్నా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.

shanti_husband_about_mp_vijayasai_reddy
shanti_husband_about_mp_vijayasai_reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 3:44 PM IST

Vijayasai Reddy affair : వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్​మోహన్​ దిల్లీలో ధర్నా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ డీఎన్ఏ టెస్టుకు ముందుకు రావాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త డిమాండ్‌ చేశారు. తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంపై వివాదం తీరాలని దిల్లీలో ఆయన డిమాండ్ చేశారు.

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను చెరబట్టారంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్ మోహన్ మణిపట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తాను విదేశాల్లో ఉంటున్న సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకుని వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారని మదన్ మోహన్ తెలిపారు. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా బుధవారం ఆయన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపారు. విజయ సాయిరెడ్డి పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌ తన భార్యను లోబరుచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. వారితో తన భార్య చట్ట వ్యతిరేకంగా బిడ్డను కని ఇచ్చిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో పాటు న్యాయవాది సుభాష్​కు డీఎన్‌ఏ టెస్టు చేయించాలని లేదంటే ఆయనను రాజ్యసభ నుంచి తప్పించాలి డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తానని మదన్​ మోహన్​ చెప్పారు.

విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని తన భార్య శాంతికుమారి చెప్పిందని, ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చానని మరోసారి చెప్పిందని మదన్​ మోహన్ గతంలో ఆరోపణలు చేశారు. తాను భార్యకు దూరంగా అమెరికాలో ఉంటున్నపుడు ఇదంతా జరిగిందని చెప్పారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు శాంతి జన్మనిచ్చినట్లుగా రికార్డులు క కూడా ఉన్నాయని వెల్లడించారు. ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్‌ పేరు ఉందని, ఆయనను సంప్రదిస్తే శాంతికి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని వివరించారు. శాంతికి, తనకు కవల పిల్లలు ఉన్నారని మదన్​మోహన్​ తెలిపారు. ఇదిలా ఉండగా తనపై వచ్చినవి అసత్య ఆరోపణలుగా విజయసాయి రెడ్డి గతంలో ట్విటర్​లో స్పందిస్తూ ఖండించారు.

'డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందే' - శాంతి మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు - ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ - Shanti Husband On Vijayasai Reddy

A2 నుంచి A1 కథేంటి? ట్విటర్ బాబాయ్‌ కాస్త ట్విటర్‌ తాతయ్య ఎలా అయ్యారు? - MINISTER ANAM FIRE ON VIJAYA SAI

ABOUT THE AUTHOR

...view details