ED Seized Assets of Former YSRCP MP MVV:వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీకి ఈడీ (Enforcement Directorate) షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించింది. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.
విశాఖ హయగ్రీవ భూముల్లో జరిగిన కుంభకోణాన్ని ఈడీ బట్టబయలు చేసింది. వృద్ధులు, అనాథలకు సేవ చేయడానికి కేటాయించిన భూముల్ని వైఎస్సార్సీపీ నేతలు అన్యాక్రాంతం చేసినట్టు దర్యాప్తులో తేల్చింది. ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా లాక్కున్నారని గతేడాది జూన్ 22న చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు చేపట్టింది.
వివేకా హత్యపై జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? - త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి: దస్తగిరి
హయగ్రీవ కేసు ఇదే:2008లో చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు ఎండాడలో 12.51 ఎకరాలను ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. ఆడిటర్‌గా రంగప్రవేశం చేసిన జీవీ, ప్రాజెక్టు అభివృద్ధి కోసం గద్దె బ్రహ్మాజీని పరిచయం చేశారు. తదనుగుణంగా ఒక ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీవీ చేతుల్లోకి ప్రాజెక్టు వెళ్లిపోయింది. ఆయన ఆ భూమికి జీపీఏ హోల్డర్. '2020లో మా సంతకాలు ఫోర్జరీ చేశారు. అమ్మకపు పత్రాలు తయారు చేసి బలవంతంగా విలువైన ఆస్తిని లాక్కోవడానికి నేరపూరితంగా వ్యవహరించారు. సేల్‌డీడ్‌లను దుర్వినియోగం చేశారు.'