Chandrababu started exercise on Seat Sharing:ఇప్పటికే వైఎస్సార్సీపీ టికెట్ కేటాయింపులు, నేతలు పోటీ చేసే స్థానాల్లో మార్పులు చేర్పులతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులకంటే, పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడం ఆయా పార్టీలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్న నేపథ్యంలో, అటు టీడీపీ, ఇటు జనసేన నుంచి ఆశావహులు టికెట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇరుపార్టీలకు ఆమోదయోగ్యం అయ్యే విధంగా టికెట్ కేటాయిపుల ప్రక్రియ కొనసాగేలా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు.
సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై దృష్టి: తెలుగుదేశం - జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేశాయి. సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు - పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారు. అతి త్వరలో మరోసారి సమావేశమై ఈ కసరత్తును కొలిక్కి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోపైనా చంద్రబాబు - పవన్ తుది కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు వచ్చే రెండుమూడు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
తాడేపల్లికి విజయవాడ సెంట్రల్ వివాదం - మల్లాది విష్ణుకు బుజ్జగింపులు