ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు: చంద్రబాబు

National Voters Day: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఓటర్లందర్లకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఓట్లు తీసెయ్యడం లేదా మార్చేసే ఓట్ల దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని చంద్రబాబు ఆరోపించారు. నకిలీ ఓట్లు చేరికల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చంద్రబాబు సూచించగా, 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ, యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

Chandrababu Naidu wishes voters
Chandrababu Naidu wishes voters

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 3:26 PM IST

National Voters Day:జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ రాష్ట్రంలోని ఓటర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అక్రమ ఓట్ల నమోదు, తొలగింపులు జరుగుతున్నాయని, ఓటు హక్కుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ, యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దు: ప్రజల ఓట్లు తీసెయ్యడం లేదా మార్చేసే ఓట్ల దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సూచించారు. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉన్నదీ, లేనిదీ చెక్ చేసుకోవాలని కోరారు. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాదన్న చంద్రబాబు, ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు హక్కని పేర్కొన్నారు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటేనన్నారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మనల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటని చంద్రబాబు స్పష్టం చేశారు.

జనసేన ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసు ఖరారు - పార్టీలో చేరిన పృథ్వీరాజ్, జానీ మాస్టర్​లు

యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలి: రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకు రావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. దీనిని సద్వినియోగించుకొని, వైఎస్సార్సీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన ఓటే మన భవిష్యత్తు అని ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నిరంకుశత్వ పాలన పోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ, యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలని నారా లోకేశ్ సూచించారు.

"ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు"

ప్రజా ప్రభుత్వంలో అంతా భాగస్వామ్యం కావాలి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారధ్యంలో యువతరం ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు, సంపద పెంపుతో మెరుగైన సంక్షేమం కావాలంటే.. తెలుగుదేశం - జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ టీడీపీకే సాధ్యమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు కానున్న ప్రజా ప్రభుత్వంలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్ వారి ఓటు పైనే ఆధారపడి ఉందని, దీని ప్రాధాన్యతను అంతా గుర్తెరగాలని లోకేశ్ స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

కొత్త ఓటరు జాబితాలోనూ అదే నిర్లక్ష్యం - అవే పాత తప్పులు!

ABOUT THE AUTHOR

...view details