Pratidhwani on CM YS Jagan Illegal Assets Case :సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని పేర్కొంది. నిందితుడు ముఖ్యమంత్రి కావటం వలన ట్రయల్ జాప్యం కావద్దని సీబీఐకి స్పష్టం చేసింది. జగన్ కేసుల్లో జాప్యంపై అఫిడవిట్ ఎందుకు వేయలేదో చెప్పాలని సీబీఐని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూటిగా ప్రశ్నించారు. వై అధినేత జగన్‌పై ఎన్నికేసులు ఉన్నాయి? ఎందుకు ఆలస్యం అయ్యాయి? చివరకి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కేసులు ఎందుకు ముందుకు కదలట్లేదు? "జగన్ కేసుల జాప్యం - సుప్రీం సూటి ప్రశ్నలు" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Supreme Court Hearing on CM Jagan Illegal Assets Case :జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.