Tips to Reduce Wrinkles on Neck :వయసు పెరుగుతున్న కొద్దీ ముఖం మీద, అలాగే మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడడం, సన్నని గీతలు రావడం సహజం! అయితే, చాలా మంది ముఖంపై ముడతలు తగ్గడానికి రకరకాల చిట్కాలు పాటిస్తారు. కానీ, మెడపై వచ్చే ముడతల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తామని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ మీ కోసం.
గుడ్డు తెల్లసొనతో!
కోడిగుడ్డులోని తెల్లసొన చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి, మొటిమలను తగ్గించడానికి, చర్మానికి తేమను అందించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, మెడపైన వచ్చే ముడతలను తగ్గించడానికి కోడిగుడ్డులోని తెల్లసొన ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం కోడిగుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపైన ప్యాక్‌లా వేసుకోవాలి. ఒక పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
12% వడ్డీ అంటే ఒక్క రూపాయి - బ్యాంకు లోన్లపై వడ్డీ సింపుల్‌గా ఎలా లెక్కించాలంటే!
ఆలివ్ నూనె (olive oil):
ముందుగా గోరువెచ్చని నీళ్లు, నూనె రహిత క్లెన్సర్‌తో ముఖం, మెడ భాగాలను క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆలివ్ నూనె తీసుకొని చేతి మునివేళ్ల సహాయంతో ఈ నూనెను మెడ వద్ద అప్లై చేస్తూ గుండ్రంగా రుద్దుతూ కాసేపు మృదువుగా మర్దన చేయాలి. ఇలా మెడ చుట్టూ ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేసుకోవడం వల్ల అక్కడి చర్మకణాలకు సహజ తేమ అందడమే కాకుండా వదులైన చర్మం తిరిగి బిగుతుగానూ మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెడకు సంబంధించిన వ్యాయామాలు :