తెలంగాణ

telangana

ఈ 5 విషయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి! ఆరోగ్య రహస్యాలు డాక్టర్స్ కూడా చెప్పరు! - Doctors Never Said Things

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 9:57 AM IST

Things Doctors Should Never Say : ఈ రోజుల్లో మెడిసిన్ లేని ఇళ్లు, వాడని మనిషి ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. ప్రతి దానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే. మెడిసిన్ వాడాల్సిందే. అయితే వీటి గురించి వైద్యులు కూడా చెప్పని కొన్ని విషయాలు మీకోసం!

Doctors Never Said Things
Doctors Never Said Things (Getty Images)

Things Doctors Should Never Say : వైద్యులు ప్రాణాలను కాపాడే దేవుళ్లని అంతా నమ్ముతారు. ఎంత మంచి డాక్టర్లు అయినా కొన్ని ముఖ్యమైన విషయాలను బయటకు చెప్పరు. సమతుల్య జీవనం గడపటానికి, ఒత్తిడి నుంచి బయటపడటానికి, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి వైద్య చికిత్సకు మించిన కొన్ని అంశాలున్నాయి. అందులో రోగుల సంరక్షణ, ఆహారపు అలవాట్లు, భావోద్వేగ శ్రేయస్సును గురించిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అలా వైద్యులు చెప్పని కొన్ని విషయాలను ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, గట్ స్పెషలిస్ట్ డాక్టర్ డింపుల్ జాంగ్దా వివరించారు.

1. ఆహారం సరిగ్గా ఉంటే మెడిసిన్ అవసరం లేదు- అలా అని!
ప్రస్తుత జీవన విధానంలో థైరాయిడ్, డయాబెటిస్, పీసీఓస్, మహిళల జననేంద్రియ సమస్యలు, జీర్ణాశయాంతర రుగ్మతలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగాయి. వీటిని నయం చేయడానికి మెడిసిన్ సరిపోవు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెడిసిన్ తీసుకున్నంత కాలం సమస్య తక్కువగానే కనిపిస్తుంది. కానీ వాడటం మానేసిన తర్వాత తిరిగి రాదని మాత్రం చెప్పలేము. అందుకే రోగానికి మూలాలను పరిష్కరించాలి. అంటే మీ ఆహారం, జీవనశైలికి సంబంధించిన అలవాట్లను మార్చుకోవాలి. వ్యాధులను పెంచే ఆహారాలు తీసుకోవడం మానేయాలి. ఇందుకు మీరు పోషకాహార నిపుణులు, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో నైపుణ్యం కలిగిన ఆయుర్వేద లేదా నేచురోపతి హెల్త్ కోచ్​ను సంప్రదించవచ్చు. వారి సూచనల ప్రకారం కఠినమైన ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి.

2. ఒకరికి పోషణ నిచ్చేది- ఇంకొకరికి విషం కావచ్చు!
ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఏ ఆహారం కూడా ఒకేలా ఉండదు. సాధారణంగా మనుషుల్లో మూడు ప్రత్యేకమైన శరీర రకాలు ఉంటాయి. ఎక్టోమార్ఫ్ (వాత ప్రకృతి), ఎండోమార్ఫ్ (కఫా ప్రకృతి), మెసోమోర్ఫ్ (పిట్ట ప్రకృతి). ఎండోమార్ఫ్ శరీరం కలవారు తప్పనిసరిగా ఎక్కువ కూరగాయలు, తక్కువ పిండి పదార్థాలు, ప్రొటీన్లు తీసుకోవాలి. అలాగే చేదు, ఆస్ట్రిజెంట్, ఘూటు ఎక్కువున్నవి, తీపి, పులుపు, ఉప్పు తక్కువున్న ఆహారలు తీసుకోవాలి.

ఎక్టోమార్ఫ్ శరీరం కలవారి విషయానికొస్తే, ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ కూరగాయలు, ప్రొటీన్లు తీసుకోవాలి. అలాగే తీపి, పులుపు, లవణం, మంచి కొవ్వులు, జిడ్డు కలిగిన ఆహారాలను ఎక్కువగా తినాలి. చేదు, ఆస్ట్రిజెంట్, ఘాటు తక్కువగానే తీసుకోవాలి. అలా మీ శరీర రకాన్ని తెలుసుకునేందుకు జన్యుపరమైన సమస్యలు, కారణాలు, వయసు తెలుసుకునేందుకు తగిన పరీక్షలు చేయించుకోవాలి.

3. మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్:
ప్రతి ఔషధం శక్తిమంతమైనదే. కాబట్టి దాన్ని వినియోగించే విధానం, సమయం వేరు వేరుగా ఉంటాయి. ఔషధాల కలయిక కారణంగా కొన్ని ఆహార విధానాలు దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి. మెడిసిన్ ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి హాని చేకూరుతుంది. కొన్ని మెడిసిన్లు ఎక్కువ కాలం తీసుకుంటే అలసట, ఊపిరి ఆడకపోవడం, వేళ్లు, పెదవులు నీలం రంగులోకి మారడం, రక్తహీనత, రక్తస్రావం, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకొన్ని మాత్రలు రొమ్ము సున్నితత్వం, తలనొప్పి, వికారం, ఉబ్బరం, రక్తపోటు వంటి వాటికి దారితీస్తుంది.

4. మెడిసిన్ వాడుతున్నప్పుడు వీటినో నో చెప్పకపోతే?
ఆల్కహాల్​లో మితమైనవి, పరిమితమైనవి, సామాజికమైనవి అంటూ వేరు వేరుగా ఉండవు. మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కాహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండింటి కలయిక అంతర్గత స్రావం, గుండె సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, తలనొప్పి, మగత, మూర్ఛ వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అలాగే ఆల్కాహాల్ రికవరీ కెపాసిటీని తగ్గిస్తుంది.

5. కొన్ని ఆహారాలు వ్యాధులకు ఆహారాలుగా మారతాయి:
వాస్తవం ఏంటంటే? ఆహార తయారీ సంస్థలన్నీ మీ వ్యసనాలతో లాభం పొందుతాయి. లాజిస్టిక్ బెనిఫిట్స్, కలరింగ్ ఏజెంట్స్, వ్యసనానికి కారణమయే రుచికరమైన పదార్థాలను కలిపి తయారు చేస్తారు. ఇవి ఎన్నో దుష్ప్రభావాలకు దారితీస్తాయి. ప్యాక్ చేసి, ప్రాసెస్ చేయడబడిన ఆహారాలు బయట ఎలాగైతే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయో అలాగే మీ కడుపులో కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. ఇవి మీ పేగులు, జీర్ణాశయాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. కనుక మీరు ఎల్లప్పుడూ తాజావి, మీరు వండుకున్న వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. నాణ్యమైన జీవితాన్ని గడపండి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details