ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / education-and-career

విదేశాలకు వెళ్లడం కన్నా పదేళ్లు ఉద్యోగం చేస్తే జీవితమే మారుతోంది, తొలి నెల నుంచే లక్ష జీతం! - JOIN INDIAN ARMY JOBS - JOIN INDIAN ARMY JOBS

ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేసుకున్న వారికి శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం, పైగా దేశ సేవలో నిమగ్నమయ్యే సువర్ణ అవకాశాన్ని ఆర్మీ ఆహ్వానిస్తోంది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ -SSC విధానంలో టెక్నికల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసి ఎక్కడో విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయడం కన్నా ఇక్కడే స్వదేశీ సేవలో గౌరవ ప్రదమైన వేతనంతో జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇది.

Join Indian Army
Join Indian Army (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 11:41 AM IST

JOIN INDIAN ARMY: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్న తరుణంలో నిరుద్యోగులకు ఆర్మీ శుభవార్త అందించింది. ఇంజినీరింగ్‌ వంటి టెక్నికల్‌ విద్యను పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులకు ఇది నిజంగా చక్కటి అవకాశమే. హోదాకు హోదా, జీతానికి జీతం అనట్లు ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే లక్ష రూపాయల జీతాన్ని డ్రా చేసే ఉద్యోగాలకు ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. (అదనపు వివరాలు, దరఖాస్తు చేయడానికి ఈ వెబ్‌సైట్‌ను లాగిన్‌ చేయండి: www.joinindianarmy.nic.in/ )

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌-SSCతాజాగా విడుదల చేసిన ప్రకటనలో 381టెక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెళ్లికాని పురుషులు, మహిళలా అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఉద్యోగ శిక్షణ తర్వాత పీజీ డిప్లొమా సర్టిఫికేట్‌తో పాటు లెఫ్టినెంట్‌ హోదాలో ఉద్యోగంలో చేరిపోవచ్చని SSC తన ప్రకటనలో వెల్లడించింది.

సాధారణంగా ఇలాంటి నియామక ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. రక్షణ రంగంలో ఆసక్తి ఉన్న అభ్యర్ధులు వీటికి పోటీ పడితే విజయాన్ని సులువుగా దక్కించుకోవచ్చు. ఉద్యోగార్ధులు ఇంజినీరింగ్‌ చదివిన బ్రాంచీ నేపథ్యంతోనే ఉద్యోగ విధులు నిర్వర్తించవచ్చు.

  • మొత్తం ఖాళీలు: పురుషులకు 350, మహిళలకు 29, ఆర్మీ విడోలకు 2లకు రెండు పోస్టులు
  • పురుషుల పోస్టుల్లో విభాగాలవారీఖాళీలు: సివిల్‌ 75, కంప్యూటర్‌ 60, ఎలక్ట్రికల్‌ 33, ఎలక్ట్రానిక్స్‌ 64, మెకానికల్‌ 101, ప్లాస్టిక్‌ 17
  • మహిళల పోస్టుల్లో విభాగాల వారీ ఖాళీలు: సివిల్‌ 7, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 4, ఎలక్ట్రికల్‌ 3, ఎలక్ట్రానిక్స్‌ 6, మెకానికల్‌ 9
  • విద్యార్హత :ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, అనుబంధ విభాగాల వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్న అభ్యర్దులకూ అవకాశం ఉంది.
  • కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టుల ఖాళీలకు బీటెక్‌ (ఐటీ), ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులవారూ అర్హులే. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్ధులు, మరొ పోస్టుకు ఇంజినీరింగ్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: ఏప్రిల్‌ 1, 2025 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1998 - ఏప్రిల్‌ 1, 2005లోగా జన్మించినవారు అర్హులు.
  • ఎంపిక తీరు: దరఖాస్తులను గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌) మార్కులతో వడపోస్తారు. అటు తర్వాత సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
  • ఇంటర్వ్యూ సెంటర్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ముఖాముఖి, సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్లు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రెండు దశల్లో ఐదు రోజులు, తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌-2 ఇంటర్వ్యూలో పాల్గొంటారు. ఇంటర్వ్యూలో నెగ్గిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఎంపికచేస్తారు.
  • శిక్షణ: ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2025 నుంచి శిక్షణ, 49 వారాలు శిక్షణలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌
  • జీతం:శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారిని లెఫ్ట్‌నెంట్‌ హోదాలో ఉద్యోగంలోకి తీసుకుంటారు. పదేళ్లు ఉద్యోగం చేయవచ్చు. లెఫ్టినెంట్‌ విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు చేరుకోవచ్చు. తొలి నెల నుంచే అన్ని రకాల సదుపాయలతో కలిపి రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు.
  • దరఖాస్తుల గడువు: ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

అదనపు వివరాలు, దరఖాస్తు చేయడానికి ఈ వెబ్‌సైట్‌ను లాగిన్‌ చేయండి: www.joinindianarmy.nic.in/

ABOUT THE AUTHOR

...view details