CTET EXAM : దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ సీటెట్(CTET) పరీక్షను ప్రతి ఏడాది రెండు సార్లు నిర్వహిస్తోంది. సీటెట్‌కు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 17 నుండి స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని CBSE విడుదల చేసింది. జనరల్ లేదా OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఒక పేపర్ కు రూ.1000, రెండు పేపర్లకురూ.1200గా నిర్ణయించారు. SC/ST/దివ్యాంగులకు ఒక పేపర్ కు రూ.500లు, రెండు పేపర్లుకు రూ.600గా పేర్కొన్నారు.
సీటెట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే పాఠశాలల ఉపాధ్యాయ నియామకాలను చేపడతారు. ఒకసారి సీటెట్ పరీక్షలో అర్హత సాధించిన స్కోరు వారికి జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లో సీటెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో పరీక్ష కేంద్రాలను CBSE బోర్డు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ప్రాధాన్యత క్రమంలో సెంటర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించారు.
సీటెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉన్నాయి. 1 నుంచ 5వ తరగతి వరకు విద్యాబోధన చేయాలనుకునే అభ్యర్ధులు పేపర్-1 పరీక్ష రాయాలి. 6నుంచి9వ తరగతి వరకు భోదన చేసే అభ్యర్ధులు పేపర్-2 పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండు పరీక్షలు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతాయి. సాధారణంగా పేపర్-2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-1 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అప్లికేషన్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఒకసారి అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన తర్వాత ఏమైనా తప్పులు గుర్తిస్తే అక్టోబర్ 21 నుంచి 25 తేదీల మధ్య సవరణలకు కూడా అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. సీటెట్(CTET)హాల్‌టికెట్లను పరీక్షకు రెండు రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫలితాలను జనవరి నెలాఖరుకు వరకు విడుదల చేసే అవకాశం ఉంది. CTET పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు మరింత సమగ్ర సమాచారాన్ని ఈ అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ కావటం ద్వారా పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్: https://ctet.nic.in/ఇక ఆలస్యం ఎందుకు అర్హులైన అభ్యర్ధులు ఈ లింక్‌ను క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.
ఇకపై ఏడాదికి రెండుసార్లు CBSE బోర్డ్ ఎగ్జామ్స్!
సీబీఎస్ఈ రగడ - ఎక్స్ వేదికగా నారా లోకేశ్ Vs వైఎస్ జగన్