ETV Bharat / state

Woman Dies Of Snake Bite In Warangal : కుటుంబంలో వరుస విషాదాలు.. అనాథలుగా మిగిలిన పిల్లలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 2:47 PM IST

Updated : Sep 28, 2023, 3:49 PM IST

Woman Dies Of Snake Bite In Warangal : వరుస విషాదాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. విధి వక్రీకరించి తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. 8 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న పిల్లలు.. ఇప్పుడు పాము కాటుకు తల్లిని కోల్పోయి.. అనాథలుగా మిగిలారు. విధి ఆడిన నాటకంలో దుర్భర స్థితిలో ఉన్న పిల్లల విషాద గాథ ఇది.

Woman Dies Of Snake Bite
Woman Dies Of Snake Bite In Warangal :

Woman Dies Of Snake Bite In Warangal : వరంగల్‌ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన బండి మానస, సురేశ్​లకు ఒక కుమారుడు ఒక కుమార్తె. భర్త సురేశ్ మద్యానికి బానిసై అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. భర్త మరణం తర్వాత తల్లిదండ్రుల వద్దకు వచ్చిన మానస తండ్రి కూడా మరణించాడు. నర్సంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఆయన మరణించడంతో ఆ ఉద్యోగం మానసకు వచ్చింది.

అప్పటి నుంచి ఆ ఉద్యోగం చేస్తూ తన తల్లిని.. ఇద్దరి పిల్లల్ని తానే చూసుకుంటోంది మానస. ఓవైపు భర్త మరణం.. మరోవైపు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మానస.. చివరకు వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డ సమయంలో పాము కాటు ఆ కుటుంబాన్ని మళ్లీ అగాథంలోకి తోసేసింది. 15 రోజుల క్రితం రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో మానసను విషసర్పం కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న మానస మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు మృతి చెందింది. అన్ని తానై పోషిస్తున్న తల్లి మరణించడంతో ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మందుకొట్టి పాముతో ఆట.. కాటేయగానే 'మృతి'.. అంత్యక్రియల వేళ లేచి కూర్చుని..

"మానస పాము కాటుకు గురై గత 15 రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్లకు ఎలాంటి ఆస్తులు లేవు. ఆమె భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించాడు. పిల్లలకు ఉండడానికి ఇల్లు తప్ప మరేం లేదు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. మానస తల్లికి వయసైపోయింది. ఇప్పుడు ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పసివాళ్లపైనే ఉంది. ఆ పసిపిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలి." - స్వామి, సమీప బంధువు

Woman Dies Of Snake Bite In Warangal : 8 సంవత్సరాల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లిని కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు ఆ పిల్లలు. వరుస విషాదాలతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. నా అనే వాళ్లు లేకుండా పోవడమే కాకుండా వాళ్ల భవిష్యత్తు నిమిత్తం కనీసం ఆస్తులు కూడా లేవని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు అన్నీ తల్లే చూసుకుందని ఇప్పుడు ఆమె కూడా మృతి చెందడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ పిల్లలకు ఓ దారి చూపించాలని కోరుతున్నారు.

లక్కీ గర్ల్.. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి

"రాత్రి తిన్న తర్వాత మానస తన పిల్లలతో పడుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ విషసర్పం మానస వీపు మీద కరిచింది. ఏదో కరిచిందని నిద్రలోనుంచి అకస్మాత్తుగా లేచి.. పక్కనే ఉన్న పామును చూసి షాకయింది. వెంటనే తన కుటుంబ సభ్యులను నిద్రలేపడంతో వారు ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే పరిస్థితి విషమించిందని చెప్పడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ 14 రోజుల నుంచి చికిత్స పొందుతున్న మానస మంగళవారం రాత్రి 11 గంటలకు మరణించింది. పిల్లలకు ఎవ్వరు లేరు. ఎలాంటి ఆస్తులు కూడా లేవు పెద్దలు దయ చూపించి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం." - ప్రమీల బంధువు

Woman Dies Of Snake Bite In Warangal కుటుంబంలో వరుస విషాదాలు.. అనాథలుగా మిగిలిన పిల్లలు

న్యూ ఇయర్ వేడుకల్లో పాము కాటుతో వ్యక్తి మృతి.. 'స్పెషల్​ గిఫ్ట్'​ అంటూ అరవడం వల్లే!

చిన్నారిపై పడగెత్తిన నాగుపాము చాకచక్యంగా కాపాడిన తల్లి

Last Updated : Sep 28, 2023, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.