ETV Bharat / state

పెళ్లికయ్యే ఖర్చును సీఎంఆర్​ఎఫ్​కు ఇచ్చేశాడు

author img

By

Published : Apr 22, 2020, 8:56 PM IST

లాక్​డౌన్​ కారణంగా పెళ్లిళ్లను కొందరు వాయిదా వేసుకుంటే... ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుంటున్నారు మరికొందరు. అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు ఓ పెళ్లికొడుకు. ఇంకొంచెం ముందుకెళ్లి తన పెళ్లికయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎంఆర్​ఎఫ్​కు విరాళంగా అందించాడు.

A BRIDEGROOM DONATED MARRIAGE EXPENSES TO CMRF
పెళ్లికయ్యే ఖర్చును సీఎంఆర్​ఎఫ్​కు ఇచ్చేశాడు

హంగూఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకోవటమే కాకుండా... దానికయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి ఆదర్శ నిర్ణయం తీసుకున్నాడు ఓ పెళ్లికొడుకు. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంతోశ్​ కుమార్ వివాహం ఈ నెల 26న జరగనుంది.

కరోనా కారణంగా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా పెళ్లి జరిపించాలని సంతోశ్​ కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే తొలుత అనుకున్నట్లుగా పెళ్లికి దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేయాలనుకోగా... ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఆ డబ్బును సీఎంఆర్​ఎఫ్​కు అందించ తలిచారు. అనుకున్నదే తడవుగా... మంత్రి హరీశ్​ రావు సమక్షంలో కలెక్టరేట్ హనుమంతరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- లాక్​డౌన్​ నుంచి వీటికి మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.