ETV Bharat / state

'ఊరికో ఆసుపత్రి, బడి లేకున్నా..  గల్లీకో బెల్ట్ షాప్'

author img

By

Published : Dec 12, 2019, 7:52 PM IST

మద్యపానం నిషేధించాలని హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ వేదికగా చేపట్టనున్న మహిళా సంకల్ప దీక్షకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పార్టీ మండల విభాగం మద్దతు తెలిపింది. మహిళలు, యువతీ యువకులతో కలిసి దీక్ష నిర్వహించి సంఘీభావం తెలిపారు.

'మహిళా సంకల్ప దీక్షలో అందరూ పాల్గొనాలి'
'మహిళా సంకల్ప దీక్షలో అందరూ పాల్గొనాలి'

మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ చేయనున్న మహిళా సంకల్ప దీక్షకు అందరూ తరలి రావాలని ఆ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ దీక్షకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మహిళలు, యువతీ, యువకులతో కలిసి దీక్ష చేపట్టారు.

ప్రభుత్వం రాష్ట్ర ఆదాయంపై దృష్టి పెడుతూ... ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కి తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా తయారు చేస్తోందని మండిపడ్డారు. గ్రామానికో ఆసుపత్రి , బడి లేకున్నా... ప్రతీ గల్లీకి మాత్రం ఓ బెల్ట్ షాప్ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. మద్యపానం మూలంగానే 70 నుంచి 85 శాతం వరకు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మద్యం నిషేధించాలనే సంకల్పంతో దీక్ష చేపట్టామని స్పష్టం చేశారు. దీక్షకు అధిక సంఖ్యలో స్త్రీలు, యువతులు తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాగ సముద్రాల సంతోష్, అనగోని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

'మహిళా సంకల్ప దీక్షలో అందరూ పాల్గొనాలి'

ఇవీ చూడండి : బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.