ETV Bharat / state

మద్యం మత్తులో.. ఓ వ్యక్తి హల్​చల్

author img

By

Published : Mar 28, 2022, 10:32 AM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తులతో రోడ్డుమీద హల్​చల్ చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

raju
రాజు

మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తులతో హల్​చల్ చేసి ఒకరిని గాయపరిచిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది. వినాయక నగర్​లో నివాసం ఉండే రాజు(40) కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సుభాష్ నగర్​లో ఉన్న మద్యం దుకాణంలో మద్యం సేవించాడు.

అక్కడే ఉన్న ఓ షాపులో రెండు కత్తులను కొనుగోలు‌ చేసి వచ్చిపోయే వారిని బెదిరిస్తుండగా ఓ వ్యక్తి చేతికి స్వల్ప గాయమైంది. స్థానికులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు. అతడు ఇంకా ఏ విషయాలు వెల్లడించలేదని సీఐ బాలరాజు తెలిపారు.

ఇదీ చదవండి: Telangana Loan : రూ.50 వేల కోట్లు దాటనున్న రుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.