సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆమరణ నిరహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం డీసీసీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పాలనాధికారి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవటం వల్ల గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య నాయకులకు లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని నాయకులు విమర్శించారు.
ఇవీ చూడండి : కలెక్టర్ గారూ కనికరించండి..!