ETV Bharat / state

ఎందరికో ఆదర్శం ఈ మహిళ... చెత్త సేకరణే తనకు పండుగ!

author img

By

Published : Oct 26, 2020, 4:40 PM IST

సద్దుల బతుకమ్మ అంటేనే మహిళల పండగ.. పువ్వులను పూజించే గొప్ప పండగ.. ఉదయం నుంచే మహిళలు పూల సేకరణ.. బతుకమ్మలు పేర్చడంలో నిమగ్నమౌతారు. కానీ పెద్దపల్లి జిల్లా గర్రెపల్లికి చెందిన నిర్మల మాత్రం ప్రత్యేకం.. భర్తకు చేదోడు వాడుగా ఉండటమే కాకుండా వినూత్నంగా తానే ఆటోడ్రైవర్‌ అవతారం ఎత్తి చెత్త సేకరణ చేపడుతోంది. తనకు కేటాయించిన ప్రాంతంలో చెత్తచెదారం లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించడమే పండగతో సమానమని ఆదర్శంగా నిలుస్తోంది.

special story on auto driver nirmala from Karimnagar
ఆదర్శం ఈ మహిళ... చెత్త సేకరణే తనకు పండుగ!

కరీంనగర్ నగరపాలక సంస్థలో సమీప గ్రామాలు విలీనం కావడంతో అధికారులు చెత్తసేకరణకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ బాధ్యత కొందరికి అప్పగించారు. నగరంలోని 40వ డివిజన్‌లో నిర్మల ఈ బాధ్యతను నిర్వర్తిస్తోంది. తానే స్వయంగా ఆటో నడుపుకుంటూ... ఇంటింట చెత్త సేకరణ కొనసాగిస్తోంది. ఎండ, వాన.. పండుగ పబ్బం అని తనకేమి ఉండదని నిర్మల చెబుతున్నారు.

ఎందరికో ఆదర్శం

మెహర్‌ నగర్‌, వివేకానందపురి కాలనీ, బాలాజీకాలనీ, బ్యాంక్‌కాలనీ ప్రాంతంలో పారిశుద్ధ్యం పనులు చేపడుతోంది. సద్దుల బతుకమ్మ అయినా తనకు మాత్రం ఇంటింటా చెత్తసేకరణే తనకు పండుగతో సమానం అంటోంది. ప్రస్తుతం రోజురోజుకు నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో భర్త మరో ఆటోతో ఇంకో డివిజన్‌లో చెత్తసేకరణ చేపడతారని.. తాను అతని వద్దనే ఆటో నడపడం నేర్చుకున్నానని చెప్పారు. ఎంత ట్రాఫిక్‌ ఉన్నా.. చెత్త ఎంతలోడ్‌ ఉన్నా సునాయాసంగా ఆటోనడుపుతానని చెబుతూ... పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

చెత్తసేకరణే పండగ

ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదని నిర్మల నిరూపిస్తున్నారని డివిజన్ కార్పొరేటర్‌ భూమాగౌడ్‌ తెలిపారు. ఎంతో ఓపికగా ఇంటింటా చెత్త సేకరిస్తారని డివిజన్ ప్రజలు నిర్మలను ఎంతో అభిమానిస్తారని అన్నారు. ప్రజలు నిర్మలను పారిశుద్ధ్య కార్మికురాలిగా కాకుండా ఇంటి ఆడపడుచుగా గౌరవిస్తామని చెబుతున్నారు. నగరపాలక సంస్థలో ఆటోనడిపే ఏకైక మహిళ ఒక్కరే ఉన్నారని అందులో తన డివిజన్‌లో ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు.

స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసాలు మరిచి అందరిని గౌరవించేందుకు ఇలాంటి పరిణామాలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.