ETV Bharat / state

Constable Kistaiah Daughter : తండ్రి ఆశయం.. కేసీఆర్ సాయం.. ఆమెను డాక్టర్‌ను చేసింది

author img

By

Published : May 11, 2023, 2:36 PM IST

Constable Kistaiah Daughter Becomes A Doctor : తండ్రి కలను సాకారం చేయాలని చిన్నప్పుడే డాక్టర్‌ కావాలనుకుంది ఆ యువతి. కానీ అండగా ఉండి ప్రోత్సాహించాల్సిన తండ్రి తెంలగాణ కోసం ప్రాణ త్యాగం చేశాడు. దాంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా సరే తండ్రి కలను ఎలాగైనా సాధించాలని బలంగా నిర్ణయించుకుంది. ఆశయం గొప్పది అయితే లక్ష్యం చిన్నది అవుతుంది అని కష్టపడ్డ ఆమెకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలిచి భరోసా కల్పించారు. ఫలితంగా తండ్రి కలను నెరవెర్చే తొలిఅడుగు వేసింది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ యువ డాక్టర్‌ ఎవరు? డాక్టర్‌గా తను ఎలాంటి సేవలు అందించాలని అనుకుంటుందో ఈ కథనంలో చూద్దాం.

Constable Kistaiah Daughter
Constable Kistaiah Daughter

తండ్రి ఆశయం.. కేసీఆర్ సాయం.. ఆమెను డాక్టర్‌ను చేసింది

Constable Kistaiah Daughter Becomes A Doctor : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న వారిలో కానిస్టేబుల్‌ కిష్టయ్య ఒకరు. కానీ ఆ సంఘటనతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. తండ్రి కల సాకారం చేయడానికి కిష్టయ్య కుమార్తె ప్రియాంక మాత్రం తన పట్టుదలను కొనసాగించింది. ఆమె సంకల్పానికి సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం తోడవడంతో చదువుల్లో ప్రతిభ చూపి వైద్య విద్యను పూర్తి చేసుకుంది. బస్తీ దవాఖానాకు వైద్యాధికారిగా విధులు చేపట్టింది ఈ యువతి.

KCR Helps Constable Kistaiah Daughter : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ప్రాణ త్యాగం చేస్తానంటూ సెల్‌ టవర్ ఎక్కిన కానిస్టేబుల్ కిష్టయ్యకు ఎవరెంత చెప్పినా టవర్‌ దిగిరాలేదు. ఎవరైనా దింపే ప్రయత్నం చేస్తే కాల్చేస్తానని హెచ్చరించాడు. భార్యాపిల్లలు వేడుకున్నా ఫలితంలేదు. తెలంగాణ కంటే తనకు కుటుంబం ముఖ్యం కాదని కరాఖండిగా చెప్పి రివాల్వర్‌తో కాల్చుకుని అమరుడయ్యాడు. అతడి మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయింది.

కేసీఆర్ భరోసా.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ప్రియాంక 7వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండే తనను... డాక్టర్‌ కావాలని, పేదలకు నీ సేవలు అందించాలని...తన తండ్రి ఎప్పుడు ప్రేరేపించేవాడని చెబుతోంది ఈ యువతి. కిష్టయ్య ఆత్మహత్య చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం కరీంనగర్‌కు వలస వచ్చింది. పిల్లల్ని ఎలా చదివించాలో తెలియక కిష్టయ్య భార్య పద్మ ఎన్నోకష్టాలు ఎదుర్కొన్నారు. అయితే అప్పటి ఉద్యమనేత ఇప్పటి సీఎం కేసీఆర్‌ ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. అవసరమైనవన్నీ సమకూర్చడంతోపాటు కిష్టయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. అలా ఆ కుటుంబం నిలదొక్కుకుంది.

కిష్టయ్య కుటుంబం బాధ్యత తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ అమరవీరుడు కిష్టయ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు అతడి ఇద్దరు పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసే బాధ్యత కేసీఆర్‌ భుజాన వేసుకున్నారు. మాట ఇచ్చినట్లే ఇద్దర్ని చదివించారు. చదువుల్లో ప్రతిభ కనిపించిన కిష్టయ్య కొడుకు రాహుల్‌కు నిజామాబాద్‌లోనే ఎన్‌సీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రియాంకను కార్పొరేట్‌ కళాశాలలో చదివించారు.

చదువుల్లో ప్రతిభ చూపి.. 2021లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ప్రియాంక.. ఏడాది పాటు చల్మెడ వైద్య కళాశాలలో హౌస్‌సర్జన్‌గా చేసింది. ఇప్పుడు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానాలో కాంట్రాక్ట్‌ ఉద్యోగంలో చేరింది. ఇలా నాన్న కలను సాకారం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది.

'ఏడాదికి 5 లక్షలు ఇచ్చి మనవరాలిని డాక్టర్‌ను చేశారు కేసీఆర్‌. వైద్యురాలిగా సేవలు అందిస్తున్న ప్రియాంక పీజీ చేయాలని భావిస్తుంది. అందుకోసం ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు' - ప్రియాంక అమ్మమ్మ, తాతయ్య

దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచి ప్రయోజకులుగా తీర్చి దిద్దారని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేస్తోంది ప్రియాంక. గైనకాలజీ చేసి.. ప్రభుత్వ డాక్టర్‌గా పేదలకు సేవలందించి ఆయన రుణం తీర్చుకుంటానంటుంది ఈ యువ డాక్టర్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.