కడుపునొప్పితో బాధపడుతున్న యువతి అత్యవసర చికిత్సకు పోలీసు వాహనమే అంబులెన్స్ అయ్యింది. పోలీసులు తమ వాహనంలో యువతిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని రామడుగు మండలం వెదిరలో యువతి కడుపునొప్పితో బాధపడుతుండగా వైద్యం కోసం అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. నొప్పి ఎక్కువ అవుతుండటం వల్ల రామడుగు ఎస్సై సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎస్సై తమ వాహనంలో యువతిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత