ETV Bharat / state

ఎంఎంటీఎస్​ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య

author img

By

Published : Nov 11, 2019, 11:09 AM IST

Updated : Nov 11, 2019, 2:39 PM IST

mmts-rail-accident

09:00 November 11

కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

                    హైదరాబాద్​ కాచిగూడ రైల్వే స్టేషన్​ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు ఇంటర్​ సిటీఎక్స్‌ప్రెస్‌(హంద్రీ ఎక్స్‌ప్రెస్‌)ను ఢీ కొట్టింది.   ఎంఎంటీఎస్‌ రైల్‌ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది  ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.

                            ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, కిమ్స్​ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  ఒక ట్రాక్‌పై  రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు సిగ్నల్‌ ఎలా ఇస్తారని  ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ  ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

Last Updated : Nov 11, 2019, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.