ETV Bharat / state

కేసీఆర్‌ సాబ్‌.. మీ సాయానికి మేం ఫిదా

author img

By

Published : Jun 27, 2020, 7:47 AM IST

Updated : Jun 27, 2020, 10:14 AM IST

కర్నల్‌ సంతోష్‌ కుటుంబానికి మీ అండ అమోఘం అంటూ... నావికాదళం డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ పవార్ కేసీఆర్​కు‌ లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌ బాట ఇతర రాష్ట్రాల సీఎంలు అనుసరించేలా ఉందని కొనియాడారు.

deputy-chief-vice-admiral-pawar-wrote-a-letter-to-kcr
కేసీఆర్‌ సాబ్‌.. కర్నల్‌ సంతోష్‌ కుటుంబానికి మీ అండ అమోఘం..

దేశం కోసం అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదారమైన సాయం ప్రకటించారని, అది ఇప్పటివరకు సైనికులకు ఎవరూ చేయనంత గొప్పగా ఉందని నావికాదళం డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుక్రవారం కేసీఆర్‌కు లేఖ రాశారు.

deputy-chief-vice-admiral-pawar-wrote-a-letter-to-kcr
నావికాదళం డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ పవార్ కేసీఆర్​కు‌ లేఖ

‘‘సీఎం కేసీఆర్‌ బాట ఇతర రాష్ట్రాల సీఎంలు అనుసరించేలా ఉంది. మాతృభూమిని రక్షించడానికి భారత సైనికులు ఎన్నడూ వెరవలేదు. అమరులైన ఎందరో సైనికుల పేర్లను జాతి గుర్తు పెట్టుకుంది. మీ చర్య ప్రతీ ఒక్కరినీ కదిలించేలా, స్ఫూర్తి నింపేలా చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా ఆలోచింపజేసింది. దేశం కోసం మేం అమరులమైతే మా కుటుంబాలకు జాతి యావత్తు అండగా ఉంటుందనే నమ్మకమైన సందేశాన్నిచ్చింది. సంతోష్‌తో పాటు అమరులైన మరో 19 మంది సైనికులకు సాయం ప్రకటించడం గొప్ప విషయం’’ అని పేర్కొన్నారు.

సంతోష్‌ కుటుంబాన్ని పరామర్శించి అపురూపమైన సాయం అందజేయడం మీ నాయకత్వ పటిమకు నిదర్శనం. ఈ విషయంలో కీలకపాత్ర పోషించిన మీ కుమార్తె, మాజీ ఎంపీ కవితకు అభినందనలు. కర్నల్‌ సంతోష్‌బాబు చదువుకున్న కోరుకొండ సైనిక పాఠశాలలో ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీరు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాం. అక్కడ చాలామంది తెలంగాణ విద్యార్థులున్నారు. అది అత్యుత్తమమైన సైనికదళాల పాఠశాలే కాదు ప్రతిభను, మేధస్సును, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది’’ అని పవార్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

Last Updated : Jun 27, 2020, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.