వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆదివారం గాంధీభవన్‌కు 25కు పైగా అర్జీలు వచ్చాయి. ఖమ్మం నుంచి వీహెచ్, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, మహబుూబాబాద్ నుంచి బెల్లయ్య, బలరామ్ నాయక్, నల్గొండ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, వరంగల్ నుంచి సిరిపురం ఇంధిర దరఖాస్తులు చేశారు. మరో రెండు రోజుల పాటు అర్జీలు తీసుకోనున్నారు.