ETV Bharat / state

హైదరాబాద్‌లో ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య కళా నిలయంలో ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కార్మికులు, కర్షకులు హాజరయ్యారు.

author img

By

Published : Aug 11, 2019, 7:05 PM IST

హైదరాబాద్‌లో ఏఐఎఫ్టియూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

నేడు సమాజంలో రెండు వర్గాలు నిరాశా నిస్పృహల మధ్య జీవనం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత నైరశ్యంలో కొనసాగుతున్నారని, నినాదాలు కనిపిస్తున్న ఆచరణ మాత్రం అమలు కావడం లేదని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర పోరాటంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల పరిరక్షించుకోవల్సిన అవసరముందని ఆచార్య హరగోపాల్ అన్నారు. సమాజంలో నిజమైన పోరాటాలలో ఐక్యత అవసరమని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రజల్లో సోషలిస్టు చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరముందని, ఆర్థిక పోరాటాన్ని రాజకీయ పోరాటంగా మార్చితేనే పేదలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

హైదరాబాద్‌లో ఏఐఎఫ్టియూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

ఇదీ చూడండి :వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

Intro:హైదరాబాద్ బాగ్లింగంపల్లి లోని సుందరయ్య కళా నిలయం లో ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరిగాయి.....

Body:నేడు సమాజంలో రెండు వర్గాలు నిరాశా నిస్పృహల మధ్య జీవనం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్కా రామయ్య విచారం వ్యక్తం చేశారు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయం లో ఏ ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరిగాయి ప్రధానంగా విద్యార్థులు యువత నైరశ్యం లో కొనసాగటం కనిపిస్తోందన్నారు ప్రస్తుతం నినాదాలు కనిపిస్తున్న ఆచరణ మాత్రం అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు... 70 ఏళ్లు కావస్తున్నా నినాదాల తోనే జీవితం గడపాలనే నైర శ్యం లో నేటి తరం ముందుకు సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఆచరణ సాధ్యమైన నినాదాలను మాత్రమే మే ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు....స్వాతంత్ర పోరాటంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య హరగోపాల్ పిలుపునిచ్చారు .....ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, రాష్ట్ర లో పెట్టుబడిదారీ వ్యవస్థ విచ్చలవిడిగా విస్మరిస్తోందని,, పెట్టుబడిదారులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.... కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు పోరాటాల సమయంలో హక్కులు రక్షించు కున్నట్టుగా భావన మాత్రమే ఉందని పెట్టుబడిదారులు సంపూర్ణంగా కార్మికుల హక్కులను హరించి వేస్తున్నారని ఆయన తెలిపారు... నేటి పాలకులు నిస్సిగ్గుగా పెట్టుబడిదారీ వైపే ఉన్నారని, కార్మికుల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్న సంఘటనలు అనేకం మన కళ్ల ముందు ఉన్నాయన్నారు.... సమాజంలో నిజమైన పోరాటాలు ఐక్యత అవసరం అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు ప్రజల్లో సోషలిస్టు చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థిక పోరాటాన్ని రాజకీయ పోరాటం గా మార్చి నేపథ్యం లో ని బడుగు బలహీన వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతుందన్నారు......

బైట్... చుక్కా రామయ్య మాజీ ఎమ్మెల్సీ
బైట్.... ఆచార్య హరగోపాల్ పౌరహక్కుల నేత
బైట్... జస్టిస్ చంద్రకుమార్ మాజీ న్యాయమూర్తి

Conclusion:హైదరాబాద్ బాగ్లింగంపల్లి లోని సుందరయ్య కళా నిలయం లో జరిగిన ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి కార్మికులు కర్షకులు హాజరయ్యారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.