భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కార్మికులతో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా 30 వేల మంది ఒప్పంద కార్మికులు వివిధ విబాగాల్లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసినందుకు ప్రత్యేక ఇన్సెంటివ్ ప్రకటించినప్పటికీ.. ఒప్పంద కార్మికులకు అవి అమలు చేయలేదని వారికి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు