ETV Bharat / sports

Ganguly on Virat Kohli: కోహ్లీని అందుకే తొలగించాం: గంగూలీ

author img

By

Published : Dec 9, 2021, 7:51 PM IST

Ganguly on Virat Kohli: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా కోహ్లీని తొలగించి రోహిత్​ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ అంశంపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

ganguly
గంగూలీ

Ganguly on Virat Kohli: టీమ్​ఇండియా వన్డే క్రికెట్​ జట్టుకు రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే.. విరాట్ కోహ్లీని కెప్టెన్​గా తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. రోహిత్​ను కెప్టెన్​గా నియమించడానికి కారణాలేంటో చెప్పాడు.

"బీసీసీఐ, సెలెక్టర్లు సంయక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. తొలుత టీ20 కెప్టెన్​గా తప్పుకోవొద్దని బీసీసీఐ విరాట్​ కోహ్లీని కోరింది. కానీ, అందుకు విరాట్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో టీ20కి ఒక కెప్టెన్, వన్డేకు మరో కెప్టెన్​ అవసరమా? అనే భావన బీసీసీఐకి కలిగింది."

--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

విరాట్​ టెస్టు కెప్టెన్​గా కొనసాగుతాడని, రోహిత్​ శర్మ వన్డే, టీ20 జట్లకు సారథిగా వ్యవహరిస్తాడని గంగూలీ స్పష్టం చేశాడు. వన్డే కెప్టెన్​గా విరాట్​ను తొలగించడానికి ముందు అతడితో మాట్లాడినట్లు దాదా చెప్పాడు. సెలెక్టర్లు కూడా విరాట్​తో మాట్లాడినట్లు పేర్కొన్నాడు. సారథిగా సేవలందించిన కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.

రోహిత్​పై నమ్మకం ఉంది..

రోహిత్​ శర్మ కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉందని గంగూలీ అన్నాడు. అయితే.. విరాట్​ సేవలను ప్రశంసిస్తూ బీసీసీఐ కూడా తాజాగా ఓ ట్వీట్ చేసింది. సారథిగా రాణించినందుకు విరాట్​కు ధన్యవాదాలు తెలిపింది.

A leader who led the side with grit, passion & determination. 🇮🇳🔝

Thank you Captain @imVkohli!👏👏#TeamIndia pic.twitter.com/gz7r6KCuWF

— BCCI (@BCCI) December 9, 2021 ">

ప్రస్తుతం టీమ్​ఇండియా సారథి రోహిత్ శర్మ భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి సారించాడు. డిసెంబర్ 26న సౌతాఫ్రికా, భారత్ మధ్య సిరీస్​ ప్రారంభం కానుంది. ఇరు జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నాయి.

ఇదీ చదవండి:

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

కోహ్లీ అవసరం జట్టుకు ఎంతో ఉంది: రోహిత్ శర్మ

KL Rahul Vice Captain: టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​గా కేఎల్ రాహుల్!

Ganguly on Virat Kohli: టీమ్​ఇండియా వన్డే క్రికెట్​ జట్టుకు రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే.. విరాట్ కోహ్లీని కెప్టెన్​గా తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. రోహిత్​ను కెప్టెన్​గా నియమించడానికి కారణాలేంటో చెప్పాడు.

"బీసీసీఐ, సెలెక్టర్లు సంయక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. తొలుత టీ20 కెప్టెన్​గా తప్పుకోవొద్దని బీసీసీఐ విరాట్​ కోహ్లీని కోరింది. కానీ, అందుకు విరాట్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో టీ20కి ఒక కెప్టెన్, వన్డేకు మరో కెప్టెన్​ అవసరమా? అనే భావన బీసీసీఐకి కలిగింది."

--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

విరాట్​ టెస్టు కెప్టెన్​గా కొనసాగుతాడని, రోహిత్​ శర్మ వన్డే, టీ20 జట్లకు సారథిగా వ్యవహరిస్తాడని గంగూలీ స్పష్టం చేశాడు. వన్డే కెప్టెన్​గా విరాట్​ను తొలగించడానికి ముందు అతడితో మాట్లాడినట్లు దాదా చెప్పాడు. సెలెక్టర్లు కూడా విరాట్​తో మాట్లాడినట్లు పేర్కొన్నాడు. సారథిగా సేవలందించిన కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.

రోహిత్​పై నమ్మకం ఉంది..

రోహిత్​ శర్మ కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉందని గంగూలీ అన్నాడు. అయితే.. విరాట్​ సేవలను ప్రశంసిస్తూ బీసీసీఐ కూడా తాజాగా ఓ ట్వీట్ చేసింది. సారథిగా రాణించినందుకు విరాట్​కు ధన్యవాదాలు తెలిపింది.

ప్రస్తుతం టీమ్​ఇండియా సారథి రోహిత్ శర్మ భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి సారించాడు. డిసెంబర్ 26న సౌతాఫ్రికా, భారత్ మధ్య సిరీస్​ ప్రారంభం కానుంది. ఇరు జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నాయి.

ఇదీ చదవండి:

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

కోహ్లీ అవసరం జట్టుకు ఎంతో ఉంది: రోహిత్ శర్మ

KL Rahul Vice Captain: టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​గా కేఎల్ రాహుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.