ETV Bharat / opinion

నష్టాలను అదుపు చేసే విద్యుత్‌ పొదుపు

గృహ వినియోగదారులు వ్యక్తిగత అలవాట్లను, జీవనశైలిని మార్చుకుంటే విద్యుత్తును చాలావరకు పొదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగించనప్పుడు వాటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం ద్వారా బిల్లుల భారాన్ని 20 నుంచి 30శాతం వరకూ తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

author img

By

Published : Mar 22, 2021, 7:32 AM IST

SUB FEATURE
నష్టాలను అదుపు చేసే విద్యుత్‌ పొదుపు

విద్యుత్‌ అనేది ఎంత తప్పనిసరి వనరో అది లేకపోతే తమ రోజువారీ జీవితాలు ఏ మేరకు స్తంభిస్తాయో, ఈ మధ్యనే అమెరికాలోని టెక్సాస్‌ ప్రజలు చవిచూశారు. ముంబయి వాసులకూ గతంలో ఇలాంటి అనుభవమే ఎదురయింది. డబ్బు ఖర్చు చేయకుండా దాచుకుంటే అది రేపటి అవసరాలకు ఉపయోగపడుతుంది. విద్యుత్‌ కూడా అంతే. వృథా చేయకపోతే అది మిగులుగా మారుతుంది. ప్రస్తుతం మనదేశ విద్యుదుత్పత్తి సామర్థ్యం 375 గిగావాట్లు. గరిష్ఠ డిమాండ్‌ 184 గిగావాట్లుగా ఉంటోంది. ఇప్పటికిప్పుడు కొరత ఎదురయ్యే పరిస్థితి లేకపోయినా- పెరుగుతున్న జనాభా అవసరాలు; ఉత్పత్తిపరంగా ఎదురవుతున్న నష్టాలు; సరఫరా, పంపిణీల్లో లోపాలు తదితర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే- విద్యుత్‌ వినియోగంలో పొదుపు పాటించడం అవసరమన్న వాస్తవం మనకు అర్థమవుతుంది.

పెరుగుతున్న వృథా..

థర్మల్‌స్టేషన్‌లో ఒక కేజీ బొగ్గును మండించి విద్యుత్తుగా మార్చే ప్రక్రియ చేపడితే అందులో గ్రిడ్‌కి చేరేది 360 గ్రాములు మాత్రమే. మిగతా 670 గ్రాములు వృథా అవుతుంది. అది విద్యుత్‌ లైన్లలోకి చేరినప్పుడు 15శాతం సరఫరా, పంపిణీ నష్టాలు ఉంటాయి. విద్యుత్‌ వివిధ రూపాల్లోకి మారినప్పుడు అందులో మరి కొంచెం వృథా అవుతుంది. ఫ్యాను లాంటిది వాడినప్పుడు, దాని మోటారు సామర్థ్యం, ఫ్యాను సామర్థ్యం తదితరాల వల్ల కూడా వృథాకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ దశకు చేరుకునేసరికి విద్యుత్‌ అవసరాలకు ఉపయోగపడిన బొగ్గు 200 గ్రాములు మాత్రమే అవుతుంది. అంటే.. 800 గ్రాముల బొగ్గు వృథా అయినట్టు లెక్క. విద్యుత్‌ సరఫరా, పంపిణీ, బిల్లింగ్‌ లోపాలు, విద్యుత్‌ చౌర్యం వల్ల భారతదేశం 30శాతం ఇంధనశక్తిని కోల్పోతోందని ఇంధన మంత్రిత్వశాఖ పేర్కొంది. 300 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం వల్ల రూ.10 లక్షల కోట్లు రావలసి ఉంటే, బిల్లుల రూపంలో వసూలవుతున్నది రూ.7.5 లక్షల కోట్లు మాత్రమే. జీడీపీలో ఈ నష్టం 1.7శాతంగా నమోదవుతోంది.

అలవాట్లు మార్చుకుంటే..

గృహవినియోగదారులు వ్యక్తిగత అలవాట్లను, జీవనశైలిని మార్చుకుంటే విద్యుత్తును చాలావరకు పొదుపు చేయవచ్చు. ప్రకృతిపరంగా సహజంగా లభించే సూర్యకాంతిని ఉపయోగించుకోవాలి. పగటివేళ లైట్లు వేసుకోకుండా ఉండటమే మంచిది. టెలివిజన్‌, కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగించనప్పుడు వాటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలి. వాటికున్న చిన్న లైటు వెలుగుతుంటే, అది విద్యుత్తును వాడుకుంటోందని అర్థం చేసుకోవాలి. వీటిని 'గోస్ట్‌ కన్జ్యూమర్స్‌'గా వ్యవహరిస్తారు. పొదుపు ద్వారా బిల్లుల భారాన్ని 20 నుంచి 30శాతం వరకూ తగ్గించుకోవచ్చని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్‌ ఉపకరణాలు కొనేటప్పుడు ఫైవ్‌ స్టార్‌ మార్కు ఉన్న వాటిని మాత్రమే చూసి కొనాలని, ఇవి 10 నుంచి 50 శాతం తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయని సూచిస్తున్నారు.

ఫిల్మెంట్‌ బల్బులకు బదులుగా సీఎల్‌ఎఫ్‌, ఎల్‌ఈడీ బల్బులను, ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, ఎలక్ట్రానిక్‌ చోక్‌లను వాడాలి. 60వాట్ల ఎల్‌ఈడీ బల్బు సాధారణంగా తొమ్మిది వాట్ల విద్యుత్తును ఉపయోగించుకుంటే, సాధారణ బల్బు 13 వాట్ల విద్యుత్తును ఉపయోగించుకుంటుంది. ఏసీలు వినియోగించడంలో విద్యుత్‌ పొదుపు కావాలంటే, వేసవికి ముందుగానే వాటిని సిద్ధం చేసుకోవాలి. 15 రోజులకోసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం వల్ల గాలి సామర్థ్యం పెరుగుతుంది. ఎండ గది లోపలికి రాకుండా కిటికీలకు పెయింట్స్‌ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీ ఉన్న గదిలో ఫ్రిజ్‌ను ఉంచకూడదు. ఫ్రిజ్‌ వేడిని బయటకు పంపుతుంది. వాషింగ్‌మెషిన్‌లో సాధారణంగా చల్లని నీరు వాడటమే మంచిది. కొద్దిగా నీరున్నప్పుడే బట్టలు ఉతకడం (రిన్సింగ్‌) ఆపేయాలి. డ్రైయరు వాడటానికి బదులుగా ఎండలో వాటిని ఆరబెట్టాలి. వాటర్‌హీటర్‌ వాడేవారు తక్కువ సమయం స్నానం చేయడం (షార్ట్‌ షవర్స్‌) మంచిది. ఇళ్లలో విద్యుత్‌ సరఫరాలో లీకేజీలున్నా ఎక్కువ విద్యుత్‌ వినియోగమవుతుంది. అలాగే మరమ్మతులు చేసిన మోటార్లు ఎక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి.

ప్రత్యామ్నాయాలపై దృష్టి అవసరం

దుకాణాలు, వ్యాపారసంస్థల వారు నియాన్‌ సైన్‌ బోర్డుల బదులు పెయింట్‌ వేసిన సైన్‌ బోర్డులు వాడాలి. పొలాల్లో విద్యుత్‌ పొదుపునకు, త్రీఫేజ్‌ మోటార్ల టర్మినల్‌ దగ్గర షంట్‌ కెపాసిటర్లను ఏర్పాటు చేసుకుంటే, విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది, పంపుసెట్ల జీవితకాలం పెరుగుతుంది. తక్కువ సామర్థ్యం ఉన్న ఫుట్‌ వాల్వులు, పటిష్ఠమైన పీవీసీ పైపులైన్లు వాడటం, క్రమం తప్పకుండా పంపుసెట్లకు 'లూబ్రికేషన్‌' చేపట్టడం వంటి చర్యలు ఫలితమిస్తాయి. మనం ఒక్కరం పొదుపు చేసినంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏముందన్న భావన సరికాదు. ప్రతిఒక్కరూ బాధ్యతతో మెలిగినప్పుడు దేశం విద్యుత్తులో మిగులును సాధించుకోగులుగుతుంది. వినియోగదారులుగా మనం బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో అత్యధిక గరిష్ఠ డిమాండ్‌కు మనం దగ్గరలో ఉన్నాం. సాధారణంగా ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య గరిష్ఠ డిమాండ్‌ ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాలన్నింటినీ ఒకేసారి వాడటం మంచిది కాదు. విద్యుత్‌ ఉపకరణాలకు ప్రత్యామ్నాయంగా సోలార్‌ ఉపకరణాలపై దృష్టి పెట్టాలి.

- పార్థసారథి చిరువోలు

ఇదీ చదవండి : హోంమంత్రి​ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు: పాటిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.