ETV Bharat / international

స్నేహితుడికి 'ఎస్' చెప్పింది.. ఆ తర్వాత?‌ - స్నేహితుడికి ఓకే చెప్పిన యువతి

తమ ప్రేమను వెలిబుచ్చుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎత్తయిన శిఖరంపైన తన స్నేహితుడికి ఓకే చెప్పిన మరుక్షణమే అదుపుతప్పి అక్కడి నుంచి పడిపోయింది యువతి. చివరకు ఏమైంది?

love proposal
ప్రేమికులు
author img

By

Published : Jan 1, 2021, 5:46 PM IST

అందమైన సాయంత్రాన, ఎత్తయిన శిఖరంపైన తమ ప్రేమను వెలిబుచ్చుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన స్నేహితుడికి ఓకే చెప్పిన మరుక్షణమే యువతి అక్కడి నుంచి అదుపుతప్పి కిందికి పడిపోయింది. అసలు విషయం ఏంటంటే..

ఆస్ట్రియాకు చెందిన ఓ జంట తమ ప్రేమను వినూత్నంగా వ్యక్తపర్చుకునేందుకు 650 మీటర్ల ఎత్తయిన శిఖరం మీదకు చేరుకుంది. అక్కడ యువకుడు తన ప్రియురాలికి ప్రేమ విషయాన్ని వెల్లడించాడు. చాలా సంతోషంగా ఆ యువతి ఆమోదం తెలిపింది. అప్పుడే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఓకే చెప్పిన మూడ్‌లో ఏమరపాటుగా ఉండటంతో ఆమె ఆ శిఖరంపై నుంచి హఠాత్తుగా కిందికి పడిపోయింది. దాంతో అతడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంతపనైంది. ఆమెకు ఎలా ఉందోనని కంగారుగా వెతకడం మొదలుపెట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఆ యువతి మంచుపై పడింది. ఆమె కింద పడిపోయిన విషయాన్ని దారి వెంట వెళ్లే వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆమె క్షేమంగా బతికిబయటపడింది. ఇంతకీ వారు ప్రేమను వెలిబుచ్చుకున్న ప్రదేశం కారింతియాలోని ఫాల్‌కార్ట్ శిఖరం. ఆమె సురక్షితంగా ఉండటంతో వారి ప్రపోజల్‌ డే సుఖాంతమైంది.

ఇదీ చూడండి: ప్రియుడి ఘనకార్యం- ప్రియురాలి ఇంటికి సొరంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.