ETV Bharat / city

చాయ్.. గరమ్ గరమ్ కరోనా చాయ్​

author img

By

Published : Jul 18, 2020, 4:22 AM IST

కరోనా వైరస్ ప్రభావంతో... అన్ని రకాల వ్యాపారాలు డీలా పడ్డాయి. ఆఖరికి చాయ్ తాగేందుకు కూడా చాలా మంది జంకుతున్నారు. ఇది గమనించిన హన్మకొండలోని ఓ హోటల్‌ యజమాని... రోగనిరోధక శక్తికి దోహదపడే పదార్థాలతో వేడివేడి టీ చేసి అమ్ముతున్నాడు. ప్రతికూల పరిస్థితుల్ని సైతం అవకాశంగా మలుచుకుంటున్నాడు.

corona special tea for health in hanmakonda
చాయ్.. గరమ్ గరమ్ కరోనా చాయ్​

చాయ్.. గరమ్ గరమ్ కరోనా చాయ్​

హన్మకొండ రాంనగర్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన టిఫిన్లు విక్రయించే ధ్యాన ప్రకృతి ఆహార మందిరం ఇది. ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ చేసే చాయ్‌కు డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ అమ్మేది కరోనా స్పెషల్ చాయ్ కాబట్టి. కరోనా వేళ వైరస్ దరిచేరకుండా ఇప్పుడు అందరూ... కషాయం తాగుతున్నారు. ఇదే తన వ్యాపార సూత్రంగా మలుచుకుని అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చినచెక్కతో తయారు చేసిన వేడివేడి టీ తో వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాడు. ఒక్కో చాయ్‌ 10 రూపాయలకు విక్రయిస్తూ... ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉపాధి పొందుతున్నాడు.

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ... శుభ్రతతో తయారు చేస్తున్నానని యజమాని చెబుతున్నాడు. ఈ చాయ్‌ వల్ల గొంతులో ఉపశమనం కలుగుతుందని... ఓరుగల్లు వాసులు అంటున్నారు. గతంలో 50 చాయ్‌లు అమ్మడం గగనమైయ్యేదని... కానీ ఇప్పుడు రోజుకు 5నుంచి 6వందల స్పెషల్ చాయ్‌లు అమ్ముతున్నట్టు హోటల్‌ యజమాని శివ చెబుతున్నాడు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400 పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.