TS Inter Exams fee: ఇంటర్మీడియట్ పరీక్ష రుసుము చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆలస్య రుసుము 200 రూపాయలతో ఈ నెల 16 వరకు.. వెయ్యి రూపాయలతో 23 వరకు.. 2వేల రూపాయలతో మార్చి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
TS Inter Exams fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోసారి పెంపు..
TS Inter Exams fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంకోసారి పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న పరీక్ష ఫీజు చెల్లింపు గడువును.. ఈ నెల 10 వరకు పెంచుతూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
![TS Inter Exams fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోసారి పెంపు.. TS Inter Exams fee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14373574-653-14373574-1643984292563.jpg?imwidth=3840)
గతంలో.. జనవరి 24తో ముగియనున్న మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు పొడిగించిన గడువు నేటితో ముగిసింది. అయితే ప్రత్యక్ష తరగతులు ఇటీవలే ప్రారంభమైనందున.. మరోసారి ఫీజు గడువు పెంచినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇదే చివరి అవకాశమని.. మరోసారి గడువు పెంచే అవకాశం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ కూడా రాసుకోవచ్చునన్నారు.
ఇదీ చూడండి: