ETV Bharat / city

Telangana News Today: 1పీఎం తెలంగాణ టాప్​న్యూస్

author img

By

Published : Aug 11, 2022, 12:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

  • 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ధన్​ఖడ్​

భారత 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు జగదీప్​ ధన్​ఖడ్​. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ధన్​ఖడ్​తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, లోక్​సభ స్పీకర్​ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

  • రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి

రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు కేంద్రం సమాచారం పంపింది.

  • నాగార్జునసాగర్​ 20 గేట్లు ఎత్తిన అధికారులు

నాగార్జునసాగర్​ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

  • రాష్ట్రంలో ఉత్సాహంగా సాగుతున్న ఫ్రీడమ్​ రన్‌

75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని.. రాష్ట్రంలో వజ్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ నెల 8న ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు రోజుకో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

  • 3 వేలలోపు ర్యాంకులకే కంప్యూటర్‌ సైన్స్‌ సీటు

ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు పొందడానికి జనరల్‌ కేటగిరీ బాలురు(తెలంగాణ) 3,089 లోపు ర్యాంకు సాధించాలి. బాలికలకు 3,773 లోపు జాతీయ ర్యాంకు తప్పనిసరి. గత విద్యాసంవత్సరం జోసా కటాఫ్‌ ర్యాంకులను బట్టి ఇది తెలుస్తోంది.

  • 'ఆన్​లైన్​ గేమ్​లో రూ.11కోట్ల జాక్​పాట్'..

అతడో ఇంజినీరింగ్ విద్యార్థి. ఆన్​లైన్​ బెట్టింగ్​ గేమ్​లో భారీగా డబ్బు వచ్చిందని విస్తృత ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అతడి స్నేహితుల్లో కొందరికి దుర్బుద్ధి పుట్టింది. అంతా కలిసి పక్కా ప్రణాళికతో అతడ్ని కిడ్నాప్ చేశారు. తండ్రికి ఫోన్​ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. చివరకు ఏమైందంటే..

  • ఐరాస వేదికగా చైనా 'ఉగ్ర' కుట్రలు..

పాకిస్థాన్​ కోసం మరోమారు ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించింది చైనా. జైషే మహ్మద్​ ముష్కరుడిపై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసి, ఆంక్షలు విధించాలన్న భారత్, అమెరికా ప్రయత్నాలకు మోకాలడ్డింది.

  • కామన్వెల్త్​లో మిస్సింగ్ కలకలం.. మొన్న 10 మంది.. ఇప్పుడు మరో ఇద్దరు

ఇప్పటికే కామన్వెల్త్​ గేమ్స్​లో పాల్గొన్న పది మంది శ్రీలంక సభ్యులు అదృశ్యమవ్వగా.. తాజాగా పాకిస్థాన్​కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు కూడా మిస్​ అయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • స్పీడ్​గా తిరిగేస్తున్న భూమి.. రోజు వ్యవధి తగ్గుతుందా?

రోజురోజుకీ భూమి వేగం పెరుగుతోంది. త్వరత్వరగా తిరిగేస్తోంది. దీంతో రాన్రానూ రోజులు 'చిన్నవైపోతున్నాయి'! అవును. ఇటీవల భూమి చరిత్రలో అతి చిన్న రోజు నమోదైంది. 24 గంటలు పూర్తి కావటానికి ఇంకా 1.59 మిల్లీ సెకండ్ల సమయం మిగిలి ఉండగానే భూమి తన చుట్టు తాను తిరిగేసింది మరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.