ETV Bharat / city

పారిశుద్ధ్య నిర్వహణపై బల్దియా నజర్

పారిశుద్ధ్య నిర్వహణపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. నగరంలో రాత్రి వేళల్లో రహదారులపై పెద్ద ఎత్తున గార్బేజ్​ వేయడాన్ని బల్దియా తీవ్రంగా పరిగణిస్తోంది. వీధి వ్యాపారులు వారంలోగా చెత్త డబ్బాలు ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

author img

By

Published : Jul 9, 2019, 7:43 AM IST

పారిశుద్ధ్య నిర్వహణపై బల్దియా నజర్

నగరంలో పరిశుభ్రతపై బల్దియా నజర్ వేసింది. సాఫ్, షాన్‌దార్ హైద‌రాబాద్, హ‌రిత‌హారం, కోర్టు కేసులు, స్ట్రీట్ వెండింగ్ పాల‌సీ త‌దిత‌ర అంశాల‌పై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రంలోనూ చెత్తను తరలించేందుకు వచ్చే సోమవారం నుంచి ప్రతి సర్కిల్​లో 4 వాహనాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. న‌గ‌రంలో గుర్తించిన 161 స‌మ‌స్యాత్మక ముంపు ప్రాంతాల చుట్టూ 500 మీట‌ర్ల విస్తీర్ణంలో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

గ్రేట‌ర్‌ పరిధిలో ప్రతిరోజు 420 మిలియ‌న్ గ్యాల‌న్ల నీటిని స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా... 50 మిలియ‌న్ గ్యాల‌న్ల నీటిని వృథాగా రోడ్లపై వ‌దులుతున్నార‌ని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృథా చేసే నీరు ప్రస్తుతం చెన్నై న‌గ‌రానికి అందించే నీటితో స‌మానమ‌ని ఆయ‌న వివరించారు. నీటిని వృథా చేసేవారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు ఉద‌యం 7గంట‌ల‌లోపు క్షేత్రస్థాయిలో పర్యటించి... చెత్తను తొల‌గించే ప్రక్రియ‌ను ఫోటోల ద్వారా నివేదిక‌ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

హ‌రిత‌హారం ల‌క్ష్య సాధ‌న‌కు కావాల్సిన మొక్కల‌ను ప్రైవేట్ న‌ర్సరీల నుంచి సేక‌రించ‌డానికి టెండ‌ర్ ప్రక్రియ‌లో మార్పు తేవాల‌ని కమిషనర్ సూచించారు. గ్రేట‌ర్​లో స్వచ్ఛత కార్యక్రమాల‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా నిర్వహించ‌డానికి సాఫ్‌, షాన్‌దార్ హైద‌రాబాద్ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. స్వచ్ఛత నిర్వహ‌ణ‌పై అల‌స‌త్వం వ‌హిస్తే స‌హించేదిలేద‌ని హెచ్చరించారు. న్యాయస్థానాల్లో జీహెచ్ఎంసీపై ఉన్న కేసులను ప్రతి వారం ప‌ర్యవేక్షించాల‌ని జోన‌ల్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్లను ఆదేశించారు.

ఇదీ చూడండి: తెలంగాణ విత్తనాలు...ఐరోపా దేశాలకు ఎగుమతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.