ETV Bharat / bharat

24 గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన తైక్వాండో మాస్టర్​

author img

By

Published : Aug 8, 2021, 7:18 PM IST

గిన్నిస్ రికార్డు​ ఒక్కసారి సాధిస్తేనే గొప్ప అనుకుంటారు చాలా మంది. అలాంటిది ఏకంగా 24 సార్లు గిన్నిస్​ రికార్డు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. అది కూడా భారతీయులకు పెద్దగా సుపరిచితం కాని తైక్వాండోలో. ఇన్ని సార్లు గిన్నిస్​ రికార్డులు సాధించిన ఆయన ఏం చెబుతున్నారో చూడండి.

record, TN
రికార్డు, తైక్వాండో

24 సార్లు గిన్నిస్​ సాధించిన తైక్వాండో కోచ్

తైక్వాండో.. భారతీయులకు పెద్దగా పరిచయంలేని కళ. అందరూ కుంగ్​ ఫూ, కరాటేపైనే ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తైక్వాండోలో పట్టు సాధించి.. ఈ కళను భారత్​లోను చాలా మందికి పరిచయం చేయాలని ప్రతినభూనాడు. ఇందుకోసం ఎంతగానో శ్రమించి రికార్డులకు రారాజుగా మారాడు. అతడే తమిళనాడుకు చెందిన తైక్వాండో కోచ్ ఎన్ నారాయణ.

మధురైకి చెందిన ఈ తైక్వాండో కింగ్ ఏకంగా 24 గిన్నిస్​ రికార్డులు సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కాలేజీ రోజుల నుంచే తైక్వాండోపై ఉన్న ఆసక్తి.. అతను ఈ రికార్డులు సొంతం చేసుకునేందుకు ముందడుగు వేసేలా చేశాయని నారాయణ చెప్పుకొచ్చాడు.

ఆరు నెలలపాటు కఠోరంగా శ్రమించి ఓ రికార్డును ఇటీవలే బ్రేక్​ చేశాడు నారాయణ. అయితే గతంలో రెండు సార్లు ఈ రికార్డు కోసం ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదని.. మూడో ప్రయత్నంలో రికార్డు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.

"గిన్నిస్​ వరల్డ్ రికార్డు సాధించి ఈ కళను ప్రమోట్​ చేయాలని ఆశించాను. 2016లో మొదటిసారిగా గిన్నిస్​ రికార్డు సాధించాను. ఇప్పటివరకు 24 గిన్నిస్​ రికార్డులు సొంతం చేసుకోగాలిగాను. ఇటీవలే యాక్స్​ కిక్​ ద్వారా సిమెంటు ఇటుకలను పగలగొట్టి రికార్డు సృష్టించాను. ఒక నిమిషంలో 37 ఇటుకలు పగలగొట్టాను."

--ఎన్​ నారాయణ, తైక్వాండో కోచ్.

గతేడాది.. కాళ్లకు 10 కేజీల బరువు ధరించి(యాంకిల్ వెయిట్) నిమిషంలో 138 కిక్స్​ చేశాడు ఈ తైక్వాండో కోచ్. అయితే.. తన జీవితంలో ఇదే అత్యంత కఠినమైన రికార్డుగా తొలుత భావించాడు నారాయణ. కానీ.. ఇంతకన్నా కఠిమైన రికార్డును బ్రేక్​ చేయడం లక్ష్యంగా పెట్టుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కొవిడ్​ సంక్షోభం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అండగా నిలిచారని, అందుకే తన రికార్డును మోదీకి అంకితం చేస్తున్నట్లు నారాయణ చెప్పాడు.

"ఓ రికార్డు కోసం నేను 30 సెకన్లలో 15 పుచ్చకాయలు​ పగలగొట్టాను. తర్వాత ఇటుకలను పగలగొట్టడం ప్రపంచంలో అత్యంత కఠినమైన రికార్డుగా గిన్నిస్​ వరల్డ్​ గుర్తించింది. కాబట్టి ఆ రికార్డును బ్రేక్​ చేయాలనుకున్నాను. తర్వాత ఆ రికార్డును దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇచ్చాను."

--ఎన్​ నారాయణ, తైక్వాండో కోచ్.

చాలా మందికి తైక్వాండో అంటే ఏమిటో తెలియదని, అందరూ.. దీన్ని కరాటేనో, కుంగ్​ఫూనో అనుకుంటారని నారాయణ అన్నాడు. అందుకే తనకున్న కళను పరిచయం చేసేందుకు రికార్డుల వేట మొదలుపెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం మధురైలో పలువురికి తైక్వాండో శిక్ష ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

ఒరిగామిలో 21 ఏళ్ల కుర్రాడి ఘనత

పుల్వామాకు చెందిన ఓ 21 ఏళ్ల ముంతజిర్ రషి.. అత్యంత సూక్ష్మమైన ఒరిగామి పేపర్​ ఫ్లవర్స్​ తయారు చేసి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. చిన్నప్పటి నుంచే పత్రికల కోసం బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్న రషి.. తన ప్రతిభకు పదును పెడుతూ కార్డ్​బోర్డ్​​ ఆర్ట్​లోను నైపుణ్యం పెంచుకున్నాడు. తర్వాత భిన్నంగా ప్రయత్నించాలని.. జపాన్​కు చెందిన ఒరిగామి ఆర్ట్​ను నేర్చుకున్నాడు.

ఈ నైప్యుణ్యాన్ని సంపాదించిన కొద్ది రోజులకే అత్యంత సూక్ష్మమైన ఒరిగామి ఫ్లవర్స్​ తయారు చేశాడు రషి. 3 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్​ ఉన్న ఫ్లవర్లను తయారు చేసి ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు రషి చెప్పుకొచ్చాడు. అతని ప్రతిభను చూస్తుంటే తమకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:వ్యర్థాలతో శిల్పం- పర్యావరణంపై సామాజిక సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.