ETV Bharat / bharat

15మందిని చంపిన పులి కోసం వేట షురూ!

author img

By

Published : Sep 22, 2021, 12:25 PM IST

15 మంది ప్రాణాలు తీసిన పులి కోసం వేట మొదలు పెట్టాయి ప్రత్యేక దళాలు. మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి.

man-eater tiger
పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్​

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది ఓ పులి. మనుషుల రక్తానికి రుచి మరిగిన ఆ మృగం ఇప్పటి వరకు 15 మందిని పొట్టనపెట్టుకుంది. దానిని పట్టుకునేందుకు ప్రత్యేక పులల సంరక్షణ దళం, రాపిడ్​ రెస్క్యూ టీం సంయుక్తంగా ఆపరేషన్​ను ప్రారంభించాయి.

" పులి కోసం రోజుకు 40 కిలోమీటర్ల మేరా అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాం. కానీ, ఇప్పటి వరకు దానిని గుర్తించలేకపోయాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మా ఆపరేషన్​ క్లిష్టంగా మారింది. ఈ ప్రాంతంలో చాలా పులులు ఉన్నందున.. మనుషులను వేటాడుతున్న మృగాన్ని గుర్తించటం కొంత సవాలుగా మారింది. ఈ ప్రాంతంలో 150 వరకు కెమెరా ఉచ్చులను ఏర్పాటు చేశాం. "

- దిలీప్​ కౌశిక్​, ప్రత్యేక దళం సభ్యుడు.

జంతువుల దాడిలో మనుషులు గాయపడటం, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు దేశంలోనే మహారాష్ట్రలో అధికంగా ఉన్నాయి. గడిచిన 9నెలల్లో మొత్తం 57మంది మరణించారు. అందులో 41 మంది పులుల దాడిలో ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. 11మంది చిరుతలు, నలుగురు ఎలుగు బంటి, ఒకరు ఏనుగు దాడిలో మరణించారు. ప్రధానంగా చంద్రాపుర్​, గడ్చిరోలీ జిల్లాల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి.

ఇదీ చూడండి: పులిని చూసేందుకు అడవికి వెళ్లాడు.. చివరకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.