ETV Bharat / bharat

'ప్రత్యేక హోదా' కోసం ఒక్కతాటిపైకి రాజకీయ పార్టీలు

author img

By

Published : Oct 15, 2020, 8:11 PM IST

జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి పునరుద్ధరణకు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఎన్​సీ అధినేత ఫారుక్ అబ్దుల్లా నివాసంలో భేటీ అయిన నేతలు.. కూటమిగా పనిచేయాలని నిర్ణయించాయి.

JK-ALLIANCE
రాజకీయ పార్టీలు

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మేరకు గురువారం సమావేశాన్ని నిర్వహించాయి. రాష్ట్రం, ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోసం కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఈ సమస్య గురించి సంబంధిత వర్గాలతో చర్చించాలని సమావేశంలో తేల్చాయి.

ఈ భేటీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా నివాసంలో జరిగింది. ఇందులో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్​ సాజద్ లోన్​, పీపుల్స్ మూమెంట్ నేత జావైద్ మీర్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి పాల్గొన్నారు.

ఒక్కతాటిపైకి..

రెండు గంటల పాటు చర్చించిన తర్వాత భేటీలో తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు తెలిపారు అబ్దుల్లా. అందరు నేతలు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించారని, ఈ కూటమికి 'పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప​కార్​ డిక్లరేషన్​' అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.

ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగే వరకు ఈ కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు అబ్దుల్లా. ఈ సందర్భంగా 14 నెలల నిర్బంధం తర్వాత విడుదలైన ముప్తీకి అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ గైర్హాజరు..

ఈ సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. కశ్మీర్ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మీర్ ఆరోగ్య కారణాల రీత్యా ఈ భేటీకి హాజరుకాలేకపోయినట్లు కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు.

ఆర్టికల్ రద్దుకు ముందు..

గతేడాది ఆగస్టు 4న భాజపా మినహా కశ్మీర్​లోని అన్ని ప్రధాన పార్టీలు అబ్దుల్లా నివాసంలో భేటీ అయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాయి. రాష్ట్రానికి అదనపు బలగాలను పంపడం, అమర్​నాథ్ యాత్ర రద్దుపై సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ విషయంలో 'గుప​కార్​ డిక్లరేషన్​'పై సంయుక్త ప్రకటన చేశాయి.

ఆ తర్వాతి రోజే జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయానికి ముందే ముఫ్తీ, అబ్దుల్లా తదితర కీలక నేతలను నిర్బంధించారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్ కోసం పోరాటం కొనసాగుతుంది: ముఫ్తీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.