ETV Bharat / bharat

దేశంలో కరోనా తీవ్రరూపం- మరో ముగ్గురు బలి

author img

By

Published : Mar 31, 2020, 11:12 AM IST

Updated : Mar 31, 2020, 11:38 AM IST

దేశంలో కరోనా మరణాలు, పాటిజివ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నాటికి మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు.

COVID-19 making more impact on india Maha 225, Chhattisgarh 8, west benal 26, kerala death 2, madya pradesh death 5
దేశంలో కరోనా తీవ్రరూపం- మరో ముగ్గురు బలి

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు బలైనవారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మరో మూడు మరణాలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్​, మహారాష్ట్రలో కేసులు గణనీయంగా పెరిగాయి.

బంగాల్​​, కేరళ, మధ్యప్రదేశ్​లో ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే చనిపోయిన ఈ ముగ్గురూ గతం నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కేరళలో మరణాలు @ 2

కేరళలో 68 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా వైరస్​ కారణంగా మృతిచెందాడు. తిరువనంతపురంలోని ఓ వైద్య​ కళాశాల ఆస్పత్రిలో ఇతడికి దాదాపు 5 రోజులు వెంటిలేటర్​ మీద చికిత్స అందించినట్లు వైద్యులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తికి కరోనాతో పాటు అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలూ ఉన్నట్లు తెలిపారు.

కేరళలో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది.

మధ్యప్రదేశ్​లో మరణాలు @ 5

మధ్యప్రదేశ్​లో 49 ఏళ్ల ఓ మహిళ కరోనా బారిన పడి చనిపోయింది. ఈ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

చందన్​ నగర్​కు చెందిన మహిళ.. మనోరమా రాజే టీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం ప్రకటించింది. ఈ మహిళ ఎటువంటి ప్రయాణాలు చేయలేదని నిర్ధరించారు. అయితే అధిక రక్తపోటు, డయాబెటిస్​తో కొన్నేళ్లుగా బాధపడుతున్నట్లు తెలిసింది.

మధ్యప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తం 47 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా.. ఇందులో 27 మంది ఇండోర్​కు చెందినవాళ్లే ఉన్నారు. జబల్​పుర్​లో 8, ఉజ్జయిన్​లో 5, బోపాల్​లో 3, శివపురి, గ్వాలియర్​లో ఒక్కో కేసు నమోదైంది.

బంగాల్​లో మరణాలు @ 3

బంగాల్​లో మరొకరు మృతి చెందారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య మూడుకు చేరింది.

హావ్​డా జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు. వైద్య పరీక్షల ఫలితాలు రాకముందే ఇతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దక్షిణ బంగాల్​లో ఇతడు పర్యటించినట్లు తెలుస్తోంది.

బంగాల్​లో నాలుగు కొత్త పాజిటివ్​ కేసులు​ నమోదయ్యాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 26కు చేరింది.

ఛత్తీస్​గఢ్​లో పాజిటివ్​​ @ 8

కరోనా మహమ్మారి దెబ్బకు ఛత్తీస్​గఢ్​లో బాధితుల సంఖ్య మొత్తం ఎనిమిదికి చేరింది. తాజాగా 22 ఏళ్ల ఓ యువకుడు లండన్​ నుంచి ముంబయి మీదుగా స్వగామమైన కోర్బా పట్టణానికి వచ్చాడు. మార్చి 18న స్వదేశానికి వచ్చిన ఇతడు దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడటం వల్ల ఇతడిని రాయ్​పూర్​లోని ఎయిమ్స్​లో చేర్చారు. ఇతడి రక్త నమూనాలను పరిశీలించగా.. కొవిడ్​-19 పాజిటివ్​గా తేలింది. ఇతడితో కలిసి ప్రయాణించిన తన చెల్లికి మాత్రం టెస్టు ఫలితాల్లో నెగిటివ్​ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కుటుంబం మొత్తాన్ని హోమ్​ క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించినట్లు కోర్బా కలెక్టర్​ కిరణ్​ కౌశల్​ తెలిపారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మహారాష్ట్రలో పాజిటివ్ ​@ 225

మహారాష్ట్రలో కొత్తగా 5 కేసులు పాజిటివ్​గా నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 225కు చేరింది. సోమవారం సాయంత్రం నాటికి ఒక్క ముంబయిలోనే 42 కొత్త కేసులు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. వారికి వైద్య పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

రాజస్థాన్​లో పాజిటివ్​ @ 83

రాజస్థాన్​లో మరో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వీరంతా ఇరాన్​ నుంచి ఇటీవల స్వదేశానికి వచ్చిన వారే. కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానంలో వీరందరినీ రాజస్థాన్​ జోధ్​పుర్​ తీసుకువచ్చి, నిర్బంధ కేంద్రంలో ఉంచింది.

రాజస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 83కు చేరింది.

బిహార్​లో పాజిటివ్​ @ 16

బిహార్​ పట్నాలో మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరింది

ఇప్పటివరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొత్తం 1,251 కేసులు నమోదయ్యాయి. ఇందులో 32 మంది చనిపోగా.. 102 మంది కోలుకున్నారు.

Last Updated : Mar 31, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.