ETV Bharat / bharat

వర్షంలో నిండు గర్భిణిని 4 కి.మీ మోస్తూ...

author img

By

Published : Aug 30, 2020, 2:22 PM IST

Updated : Aug 30, 2020, 3:20 PM IST

వర్షా కాలం వచ్చిందంటే చాలు.. కొన్ని పల్లెటూర్లలో మట్టి రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితే ఒడిశాలోనూ తలెత్తగా.. అంబులెన్స్​ ఆ గ్రామంలోకి రాలేకపోయింది. ఫలితంగా వర్షంలోనే ఓ నిండు చూలాలును కాలినడకన మోసుకెళ్లారు కుటుంబసభ్యులు.

A pregnant  woman carried in a stretcher over 4 km to reach hospital
గర్భిణిని స్ట్రెచర్​పై తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

ఒడిశా నవరంగపుర్​లోని ఓ గ్రామంలో నిండు గర్భిణిని సుమారు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రెచర్​పై తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆ ఊరికి సరైన రోడ్డు మార్గం లేకపోవడమే ఇందుకు కారణం.

ఇదీ జరిగింది..

మైదల్​పుర్​లో దామీ శాంతా అనే గర్భిణికి ఆదివారం ప్రసవ నొప్పులు రాగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అత్యవసర వాహనాన్ని సంప్రదించారు కుటుంబ సభ్యులు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. బురదమయమైన మార్గం గుండా ఆ ఊర్లోకి వచ్చేందుకు నిరాకరించాడు అంబులెన్స్​ డ్రైవర్​. ప్రధాన రహదారిపైనే వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో వర్షంలోనే ఆమెపై కవర్​ కప్పి స్ట్రెచర్​పై తీసుకెళ్లారా కుటుంబ సభ్యులు. అలా 4 కిలోమీటర్ల మేర కాలినడకన పయనించారు. అనంతరం ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన ఒంటె

Last Updated : Aug 30, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.