Telugu Mahila President Anitha Hot Comments on CM Jagan: సీఎం జగన్​కు చెప్పకుండా.. చంద్రబాబును అరెస్ట్​ చేస్తారా..?: వంగలపూడి అనిత - Telugu Mahila President Anitha news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 4:19 PM IST

Telugu Mahila President Anitha Hot Comments on CM Jagan: 'టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నాకు ఎలాంటి కక్ష లేదు. కక్ష సాధింపుతో ఆయన్ను ఎవరూ అరెస్టు చేయలేదు. నేను దేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్న సమయంలో పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు' అంటూ వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై.. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఘాటుగా స్పందించారు. రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేయలేదంటూ జగన్ కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 

Vangalapudi Anita comments: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 70 మంది తెలుగుదేశం కాార్యకర్తలు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ..''ముఖ్యమంత్రికి చెప్పకుండా ప్రతిపక్ష నేతను పోలీసులు అరెస్టు చేస్తారా..? నాలుగున్నరేళ్ల వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఎన్ని కార్యక్రమాలతో జనంలోకి వెళ్లినా తిరస్కారం తప్పదు. ఆత్మాభిమానం ఉన్న ఎవరూ జగన్‌ను మళ్లీ రావాలి, కావాలని కోరుకోరు. 'వై ఏపీ నీడ్స్ జగన్ కాదు.. వి డోంట్​ వాంట్​ ఎగైన్ జగన్'... నాలుగున్నరేళ్లుగా ప్రజలతో ఆడుకున్నది సరిపోలేదా..? జగన్ పేరు వినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. ఆరు నెలల తర్వాత జగన్‌కు ప్రజలు హర్రర్ సినిమా చూపిస్తారు. రోజా ఒక్కరే ఆడపిల్లనా..? నారా భువనేశ్వరి, రేణుదేశాయ్‌లపై వైసీపీ నాయకులు అసభ్యంగా మాట్లాడినప్పుడు ఈ సినీ ప్రముఖులు ఏమయ్యారు..? నాపై అసభ్య పోస్టులు పెట్టినప్పుడు రోజా సహా నటీమణులు ఎక్కడికి వెళ్లారు..?' అని ఆమె నిలదీశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.