ప్రతిధ్వని: కరోనా ప్రభావం.. స్వీయ రక్షణే కీలకం - భారత్ డిబేట్
🎬 Watch Now: Feature Video
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. దాదాపు ఐదున్నర లక్షల కేసులతో భారత్ లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. అయితే.. మన దేశంలో కరోనా విజృంభణ ఇంకా కరోనా తారాస్థాయికి చేరలేదంటున్న అంచనాలు.. మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలతో లాక్ డౌన్ కు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తోంది. హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ అమలు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కరోనా కట్టడి దిశగా ప్రభుత్వాలు ఇంకా.. చేయాల్సింది ఏంటి? ప్రజల స్వీయ రక్షణ.. కోవిడ్ వ్యాప్తి కట్టడిలో అత్యంత కీలకం.. అన్న అంశాలపై.. ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jun 29, 2020, 10:24 PM IST